Sunday, October 19, 2025 08:25 PM
Sunday, October 19, 2025 08:25 PM
roots

తప్పుడు పనులు చేస్తే వదలను.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

గత కొన్నాళ్ళుగా టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వ్యాఖ్యలతో పాటుగా సివిల్ తగాదాల్లో తలదూర్చడం వంటి చర్యలకు పాల్పడుతూ వస్తున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం ఎన్ని సార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేల వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. తాజాగా పలువురు ఎమ్మెల్యేలకు సిఎం నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. అమరావతి పిలిచి మరీ క్లాస్ పీకారు. ఇక నేడు కేబినేట్ సమావేశం అనంతరం కూడా సిఎం ఘాటు వ్యాఖ్యలు చేసారు.

Also Read : సాక్షికి లీగల్ నోటీసులు..!

ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదు అని హెచ్చరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుగోలుగా వ్యవహరిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు అని సీఎం చంద్రబాబు నిలదీశారు. తప్పు చేసింది ఎవరైనా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేసారు. పరోపకారమే పరమ ధర్మం అనేది భారతీయ ధర్మమని, ఎమ్మెల్యేలు ఆదర్శంగా నిలవాలని, ఎవరిని అయినా సరే క్షమించే ప్రసక్తే లేదన్నారు. అమరావతి సచివాలయంలో నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read : ఎమ్మెల్యే వేధిస్తున్నాడు.. మహిళా నటి సంచలన కామెంట్స్..!

22 ప్రతిపాదన పై చర్చించనున్న సిఆర్డిఏ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినేట్. అమరావతిలో భూముల కేటాయింపులపై మంత్రుల కమిటీ సిఫార్సు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రి వర్గం. నాలా చట్టం రద్దు బిల్లు పై క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పట్టణ అభివృద్ధి సిఆర్డిఏ మున్సిపల్ చట్టానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతి ఎల్పీజీ జోన్ లో గ్రామ పంచాయతీల అభివృద్ధికి పనులు చేపట్టాలని నిర్ణయించారు. రూ. 904 కోట్లకు పరిపాలన అనుమతి పై చర్చించింది కేబినేట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

పాక్ ఏడుపు అందుకే.....

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు...

పాకిస్తాన్ కు కెలకడం...

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో...

సీమలో భారీగా ఉగ్ర...

ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశవ్యాప్తంగా ఇప్పుడు...

ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం.....

- ఆస్ట్రేలియా వర్సిటీల్లో అధునాతన బోధనా...

రాజకీయాల్లోకి మరో వారసుడు.....

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొంతకాలంగా...

ఒకరు క్లాస్.. మరొకరు...

ఏపీలో కూటమి సర్కార్‌ అన్ని విధాలుగా...

పోల్స్