Monday, October 27, 2025 10:37 PM
Monday, October 27, 2025 10:37 PM
roots

టీడీపీ ఫ్యూచర్ లీడర్ పై అధ్యక్షుని క్లారిటీ..!

మహానాడు వేదికపై నుంచే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత ఎవరో ప్రస్తుతం పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చేశారు. కడపలో జరుగుతున్న పసుపు పండుగ మహానాడును తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించకుంటున్నారు. వైసీపీ కంచుకోట కడపలో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశల నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు కడపకు చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తెలుగు తమ్ముళ్లు అహోరాత్రులు కష్టపడి పనిచేశారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను భూస్థాపితం చేశారు.

Also Read : వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..!

ఈ గెలుపులో ప్రస్తుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌దే సింహభాగమంటూ టీడీపీ నేతలు తొలి నుంచి చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసింది నాటి వైసీపీ ప్రభుత్వం. ఏకంగా 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు ఉన్నారు. అధినేత అరెస్టుతో తెలుగు తమ్ముళ్లలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. వైసీపీ ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరారు. చివరికి ఎన్నికల్లో ప్రజలు కూడా ఓటుతో బుద్ది చెప్పారు.

అయితే ఇదే సమయంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదిరించిన నేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2023 జనవరి 25వ తేదీన కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర మొదటి రోజు నుంచి వైసీపీ సర్కార్ అడుగడుగునా ఆటంకం కల్పించింది. చివరికి సభా వేదికకు కూడా అనుమతించలేదు. అరెస్టులు, అక్రమ కేసులు, ఆంక్షలు.. ఇలా ఒకటేమిటి.. చివరికి కార్యకర్తలకు కనిపించేందుకు వేసుకున్న స్టూలు కూడా పోలీసులు లాగేందుకు ప్రయత్నించారు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా.. మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర పూర్తి చేశారు లోకేష్.

Also Read : సంక్షేమానికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్..!

ఆనాడు పార్టీ ప్రారంభించిన తొలినాళ్లల్లో అన్న గారు ఎన్టీఆర్ కోసం తెలుగు ప్రజలు ఎంతగా ఎదురు చూశారో అందరికీ గుర్తే. అన్నగారి రాకకోసం 24 గంటలుపైగా అన్ని చోట్ల జనం బారులు తీరారు. అర్థరాత్రి, అపరాత్రి అనేది కూడా జనం చూడలేదు. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. ఒంగోలులో, విజయవాడలో కూడా లోకేష్ కోసం ప్రజలు బారులు తీరారు. విజయవాడ వంటి మహా నగరంలో అయితే ఏకంగా తెల్లవారు జాము 3 గంటల వరకు పాదయాత్ర సాగింది. జోరు వానలో కూడా పాదయాత్రకు బ్రేక్ పడలేదు. లోకేష్ వెంట నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా కదం తొక్కారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పాదయాత్రలో భాగం పంచుకున్నారు.

ఇదే ఊపుతో 2024 ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు ఎంతో కష్టపడి పని చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులను ధీటుగా ఎదుర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల ఘన విజయంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసిన ప్రతి నేతకు సరైన గుర్తింపు ఇచ్చారు చంద్రబాబు. అదే సమయంలో పార్టీలో కార్యకర్తే అధినేతగా మారాలనే మాటను లోకేష్ పదే పదే చెప్పారు. పార్టీలో సీనియర్లు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. సామాన్య కార్యకర్త కూడా పొలిట్‌బ్యూరో స్థాయికి చేరుకోవాలని పిలుపిచ్చారు.

Also Read : వంశీ మరణం.. పేర్ని సంచలన కామెంట్స్

ఇక కడప మహానాడు వేదికపై తొలి ప్రసంగం చేసిన పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు కీలక ప్రతిపాదన చేశారు. టీడీపీకి అనుభవమున్న నాయకత్వం చంద్రబాబు, యువ నాయకత్వం లోకేష్ అని వ్యాఖ్యానించారు. పార్టీ పగ్గాలను నారా లోకేష్‌కు అప్పగించాలని పల్లా సూచించారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉన్నారని సూచించారు. మంగళగిరిలో 2019లో ఓడినప్పటికీ.. నియోజకవర్గం ప్రజలను, కార్యకర్తలను మర్చిపోలేదని.. అందుకే 2024 ఎన్నికల్లో ఏకంగా 90 వేల పైగా ఓట్ల మెజారిటీ సాధించారన్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ నేతలు కాలకేయుల మాదిరిగా తయారయ్యారని.. వారి నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. 2029లో కూడా టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. పదవులు రాలేదని ఎవరూ బాధ పడవద్దని.. కష్టపడిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా గుర్తింపు వస్తుందన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్