Saturday, September 13, 2025 03:23 AM
Saturday, September 13, 2025 03:23 AM
roots

మహిళపై దాడి.. డైరెక్ట్ గా ఎస్పీకి చంద్రబాబు ఫోన్

ఈ మధ్య కాలంలో అప్పులు ఇచ్చిన వారి ఆగడాలు రోజు రోజుకు మితి మీరడం సంచలనంగా మారుతోంది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో కొత్త చట్టం కూడా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సిఎం సొంత నియోజకవర్గంలో కుప్పంలో జరిగిన ఓ ఘటన సంచలనంగా మారింది. అప్పు తీసుకుని, సమయానికి చెల్లించలేదు అనే కారణంతో ఓ మహిళను చిత్ర హింసలకు గురి చేయడం సంచలనం అయింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆగ్రహం వ్యక్తం చేసారు.

Also Read : పన్నులో మినహాయింపు మోసాలు, ఐటి అధికారులు సంచలన నిర్ణయం

కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడి చేసిన ఘటనపై అధికారులతో సిఎం మాట్లాడారు. మహిళపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు సిఎం. జిల్లా ఎస్పీతో సీఎం మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఘటనలో నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ వివరణ ఇవ్వగా.. మహిళలను హింసించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

Also Read : వైసీపీలో ఊపు వస్తుందా.. సాధ్యమేనా..?

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద రూ.80 వేలు అప్పు తీసుకోగా.. అప్పుల భారం భరించలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అతని భార్య శిరీష పుట్టిల్లు శాంతిపురం మండలం కెంచనబల్లలో ఉంటూ బెంగళూరులో కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తోంది. ఈ క్రమంలో సోమవారం నారాయణపురం పాఠశాలలో కుమారుడి టీసీ తీసుకునేందుకు వచ్చిన శిరీషను మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలు జగదీశ్వరి పట్టుకొని.. భర్త తీసుకున్న డబ్బు చెల్లించాలని ఆమెతో వాగ్వాదానికి దిగి.. ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభుత్వంపై విమర్శలు రావడంతో నేరుగా సిఎం జోక్యం చేసుకుని, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్