తెలంగాణ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి ఎప్పుడు అడుగుపెడుతుందా.. పూర్తిస్థాయిలో తెలుగుదేశం, జనసేన, తెలంగాణలో బిజెపికి ఎప్పటినుంచి సహకరిస్తాయి.. అధికార పార్టీని ఎదుర్కొని ప్రజా పోరాటాలు ఎప్పటి నుంచి మూడు పార్టీలు కలిసి నిర్వహిస్తాయి..? దీని గురించి దాదాపు ఐదారు నెలలుగా ఎన్నో వార్తలు చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుందని సంకేతాలు కూడా వచ్చాయి.
Also Read : వైసీపీలో నువ్వుంటే చాలంటున్న టీడీపీ నేతలు..!
భారత రాష్ట్ర సమితిలో అసంతృప్తిగా ఉన్న నాయకులు కొంతమంది తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం.. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికపై కసరత్తు జరుగుతుందని ప్రచారం జరగటం వంటివి చూశాం. అయితే ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో ఎన్డీఏ కూటమి పూర్తిస్థాయిలో రాజకీయ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నట్లుగా క్లారిటీ వస్తుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.
Also Read : కృష్ణంరాజు.. దీనవ్వ తగ్గేదెలా..!
త్వరలోనే బిజెపి, టిడిపి, జనసేన బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి మూడు పార్టీలు కసరత్తు మొదలుపెట్టేసాయి. జిల్లా కమిటీలతో పాటుగా గ్రామస్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గ అధ్యక్షులను కూడా ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి నుంచే కూటమి రాజకీయం మొదలుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
Also Read : కూటమి.. పొత్తు ధర్మం పాటిస్తారా లేదా..?
ఒకవేళ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఎవరికైనా సీటు ఇస్తే పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ విషయంలో మూడు పార్టీలు త్వరలోనే నిర్ణయం తీసుకుని.. తాము క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న జిల్లాల్లో పోటీ చేసే అంశంపై అధికారిక ప్రకటన చేయాలని కూడా భావిస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల మీద దృష్టిపెట్టే అవకాశాలు ఉన్నాయి. బిజెపి హైదరాబాద్ తో పాటుగా నిజామాబాద్, అదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో.. దృష్టి పెట్టవచ్చని భావిస్తున్నారు.
Also Read : మరో వివాదంలో సింగర్ మంగ్లీ..!
స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని మూడు పార్టీలు భావిస్తున్నాయి. తాజాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ బిజెపి నేతలు సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కల్వకుంట్ల కుటుంబంలో వచ్చిన చీలికపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ కవిత పార్టీ మారే ఆలోచనలో ఉంటే ఆమెను ఏ పార్టీలోకి తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కవిత విషయంలో భారత రాష్ట్ర సమితి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది. బిజెపి తాను బలపడాలనుకున్న రాష్ట్రాల్లో కుటుంబాలను చీల్చడంలో సిద్ధమస్తురాలు. మరి కవిత విషయంలో ఏం చేస్తుందో చూడాలి.