Monday, October 27, 2025 08:33 PM
Monday, October 27, 2025 08:33 PM
roots

కార్యకర్తల కోసం ఓ రోజు.. చంద్రబాబు, లోకేష్ కీలక నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలు ముగింపు రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడిన ఆయన ఏబిసిడి కేటగిరి విభజన కోసం 1996లో కమిటీ వేశామని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రేష్నలైజేషన్, క్యాటగిరీలపై 2000 సంవత్సరంలో చట్టం చేశామని తెలిపారు. ఆ చట్టాన్ని కోర్టు కొట్టి వేసిందని… ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందేనని ఉషా మహిళా కమిషన్ నివేదిక ఇచ్చిందని చంద్రబాబు ప్రస్తావించారు.

Also Read : జగన్ కోసం విజయసాయి కొత్త స్ట్రాటజీ..?

స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై కూడా కమిటీ అధ్యయనం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ సాకారం కావడంలో తన ప్రయాణం కూడా సుదీర్ఘంగా సాగిందని వెల్లడించారు. మొదట కమిటీ వేసినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఉండటం తన అదృష్టం అన్నారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు చంద్రబాబు. పేదల కోసం శాశ్వత గృహ నివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.

Also Read :బెట్టింగ్ యాప్స్.. సినిమా వాళ్ళపైనే పోలీసుల గురి

ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతూ ఉండటం బాధాకరమని… అంటరానితనం నిషేధానికి జస్టిస్ పున్నయ్య కమిషన్ ను తానే ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అంటరానితనం రూపుమాపటానికి ఎన్నో జీవోలు జారీ చేశామని… ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కారానికి ఎస్సీ, ఎస్టీ సెల్ ఏర్పాటు చేశామని… హోటల్స్, మంచినీటి బావుల వద్ద వివక్ష పాటించకుండా… చట్ట పరంగా చర్యలు తీసుకున్నామన్నారు. సాంఘిక సమానత్వం పై ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించమని తెలిపారు.

Also Read :ఆ క్రెడిట్ చంద్రబాబుదే.. పవన్ కు చంద్రబాబు థాంక్స్..!

లోక్సభ స్పీకర్ గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం అని గుర్తు చేశారు. స్పీకర్ గా బాలయోగి ఎంతో బాగా రాణించారని… దళిత మహిళ ప్రతిభ భారతిని స్పీకర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ఎస్సీ అయిన కాకి మాధవరావును రాష్ట్ర సీఎస్ గా చేసింది తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో తనకు సహకరించిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబునాయుడు ధన్యవాదాలు తెలిపారు.

Also Read : టార్గెట్ జగన్‌.. వైసీపీ నేతల తీరు..!

ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుపై ప్రసంశలు కురిపించారు. ఎస్సీ వర్గీకరణ ఇన్నాళ్లు… బ్రతికి ఉందంటే సీఎం చంద్రబాబు, మందకృష్ణ పుణ్యమే అంటూ ఆయన కొనియాడారు. మాదిగ అని చెప్పగలిగే గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మందకృష్ణ అని పేర్కొన్న పవన్ కళ్యాణ్… ఆ కులానికి వన్నెతెచ్చిన ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. ఎస్సీ వర్గీకరణ పై చాలా చర్చలు జరిగాయన్నారు పవన్ కళ్యాణ్. గుర్తింపు లేని కులాల పైన విస్తృతంగా చర్చలు జరిగాయని వివరించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్