Wednesday, February 4, 2026 02:32 PM
Wednesday, February 4, 2026 02:32 PM

వారిపై చంద్రబాబు, లోకేష్ ఫోకస్..!

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరు గమనించిన వారికి ఒక విషయం స్పష్టమైంది. ముందుగా కట్టుతప్పిన రాష్ట్ర పరిపాలనను గాడిలో పెట్టారు. అలాగే అప్పుల ఊబిలో రాష్ట్ర ఖజానాకు ఊపిరి అందించారు. పెట్టుబడులు పెట్టేందుకు వెనకడుగు వేసే పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. గూగుల్ వంటి బడా సంస్థ ఏపీలో లక్షన్నర కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుగు వచ్చేలా చేశారు. ఆగిపోయిన రాజధాని అమరావతి పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ.. ప్రభుత్వంపై నమ్మకం కలిగించారు చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ.. అదే సమయంలో పరిపాలనతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పనులను సమానంగా నిర్వహిస్తూ.. కూటమి ప్రభుత్వం అంటే.. ప్రజా ప్రభుత్వం అనే పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు.

Also Read : జూబ్లీహిల్స్ లో కమ్మ సామాజికవర్గం మద్దతు ఎవరికి?

వాస్తవానికి చంద్రబాబు నాయుడు అంటే అందరికీ ఒక విషయం గుర్తుకు వస్తుంది. ఎవరైనా పనిలో అలసత్వం చూపిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు. మరీ ముఖ్యంగా అధికారులపైనే వేటు పడుతుంది. ప్రజల వద్దకే పాలన పేరుతో ఆకస్మిక పర్యటనలు చేసిన చంద్రబాబు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులతోపాటు అలసత్వం వహించిన ఉద్యోగులపై కూడా ఆన్ ది స్పాట్ సస్పెండ్ అంటూ ఆర్డర్ చేశారు. ఇక పరిపాలన విషయంలో చంద్రబాబు ముక్కుసూటిగా ఉంటారని.. ఎవరి మాట పట్టించుకోరనే మాట కూడా ఉంది. ఇక అదే సమయంలో బ్యూరోక్రాట్ల మాట వింటారనే అపవాదు కూడా ఉంది. చంద్రబాబు తీరు వల్లే కొంత మంది సీనియర్ నేతలు కూడా పార్టీకి దూరమయ్యారనేది వాస్తవం. పార్టీలో గ్రూప్ రాజకీయాలున్నాయని బహిరంగంగా చెప్పినా కూడా చంద్రబాబు పట్టించుకోరని.. అందుకే వెళ్లిపోతున్నామని బహిరంగంగానే విమర్శలు చేశారు. అయినా సరే.. చంద్రబాబు మాత్రం.. పార్టీ నేతల విషయంలో కాస్త అలసత్వం వహించే వారు.

Also Read : పోతే పొండి.. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సంచలన కామెంట్స్

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల పాటు కేవలం పరిపాలనపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీంతో పార్టీ నేతలు కొందరు లైన్ దాటి వ్యవహరిస్తున్నారు. పార్టీలో కొందరు నేతల తీరుపై బహిరంగంగానే ఆరోపణలు వచ్చాయి. గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని.. పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారని సొంత పార్టీ నేతలతో పాటు అనుకూల మీడియా కూడా పదే పదే హెచ్చరించింది. అయినా సరే.. పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు, క్రమశిక్షణ కమిటీ నోటీసులు.. లేదా అధినేత వార్నింగ్ తప్ప పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో మరికొందరు నేతలు రెచ్చిపోయారు. పార్టీలో కొందరి అండ చూసుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారు. చివరికి ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉన్నారు. దీని వల్ల పార్టీకి, ప్రభుత్వానికి కావాల్సినంత చెడ్డపేరు వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే.. ఎన్నికల్లో ప్రభావం పడుతుందని.. ఇప్పటికే పలు సర్వే సంస్థలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా స్వయంగా రంగంలోకి దిగారు.

Also Read : లోకేష్ దెబ్బకు అలెర్ట్ అయిన టీడీపీ నేతలు.. నియోజకవర్గాల్లో పరుగులు

నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరు పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ప్రజాదర్బార్ పేరుతో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ లైన్ దాటుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు, కావ్య కృష్ణారెడ్డి వంటి నేతలకు నోటీసులిచ్చారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అన్నిటికంటే ముఖ్యంగా.. తనకు నేతలకంటే.. పార్టీ గెలుపు ముఖ్యమంటూ లోకేష్ చెప్పిన మాటలు ఇప్పుడు ఎమ్మెల్యేల్లో గుబులు రేపాయి. పార్టీ గెలిస్తేనే పదవులు వస్తాయని లోకేష్ తేల్చేశారు. అంటే.. పార్టీ కోసం ఏ స్థాయి నేతనైనా సరే.. పక్కన పెట్టేందుకు సిద్ధం అని వార్నింగ్ ఇచ్చారు లోకేష్.

Also Read : మాలేపాటి అరెస్టు.. లబోదిబో అంటున్న జగ్గు బ్యాచ్..!

దీంతో ఆఘమేఘాల మీద అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇక చంద్రబాబు కూడా తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల ఎంపిక, రాష్ట్ర కమిటీ అంశాలపై ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ అధ్యక్షులపై కసరత్తు దాదాపు పూర్తి చేశారు. త్వరలో 25 స్థానాలకు అధ్యక్షులను ప్రకటించనున్నారు. అదే సమయంలో రాష్ట్ర కమిటీపై కూడా కసరత్తు మొదలుపెట్టారు. నామినేటెడ్ పదవులు రాని వారికి పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీనియర్లు – యువతకు సమన్యాయం చేస్తూ త్వరలో కొత్త కమిటీ ప్రకటన చేస్తారనే మాట ఇప్పుటు పార్టీలో బాగా వినిపిస్తోంది. మొత్తానికి ఇన్ని రోజులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు పార్టీపై కూడా ఫోకస్ చేయడంతో.. తెలుగు తమ్ముళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్