ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు గత రెండు నెలల నుంచి విదేశాలపై ఎక్కువగా దృష్టి సారించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే క్రమంలో పలు దేశాల్లో పర్యటిస్తున్న క్యాబినెట్ మంత్రులకు, ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభిస్తుంది. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రం నుంచి పెద్దగా మంత్రులు ఎవరూ విదేశాలకు వెళ్లి పెట్టుబడులను ఆహ్వానించే ప్రయత్నం చేయలేదు. ఇక విదేశాల్లో ఉన్న తెలుగువారితో మమేకం అయ్యే ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదని చెప్పాలి. ఆ సమయంలో రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా విదేశాల్లో ఉన్న తెలుగు వారు పెట్టుబడి పెట్టే విధంగా లేవు అనే విషయం స్పష్టంగా అర్థమైంది.
Also Read : బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి..?
రాష్ట్రంలో వ్యాపారం చేయాలంటే వేధింపులు ఎదుర్కోవాలి అనే అభిప్రాయం అప్పట్లో చాలామందిలో ఉండేది. ఇక ఇప్పుడు పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయడంతో పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇటీవల గూగుల్ రాష్ట్రానికి రావడంతో పలు కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. తాజాగా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనకు వెళ్ళగా, మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఈ రెండు పర్యటనల్లో తెలుగువారి నుంచి, అక్కడి పారిశ్రామికవేత్తల నుంచి విశేష స్పందన వచ్చింది. లోకేష్ ను కలిసేందుకు ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు వారు పెద్ద ఎత్తున ఆయన ఉన్న ప్రాంతానికి తరలి వెళ్లారు. ఇక లోకేష్ కూడా వారితో అదే విధంగా మమేకమయ్యారు.
Also Read : ఎంపీలు, ఎమ్మెల్యేలకు చుక్కలే.. చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించే వారికి స్వాగతం పలికారు లోకేష్. ఇక చంద్రబాబు తాజాగా దుబాయిలో తెలుగువారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 10 దేశాల నుంచి తెలుగువారు, పలు రంగాల్లో ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. దుబాయ్ తో పాటుగా అబుదాబి, కువైట్, ఒమన్, బహ్రెయిన్, సహా పలు దేశాల ప్రముఖులు ఉత్సాహంగా హాజరయ్యారు. ఇజ్రాయిల్ లో ఉండే తెలుగువారి సైతం చంద్రబాబు కార్యక్రమానికి హాజరు కావడం గమనార్హం. అటు చంద్రబాబుతో పాటు వెళ్లిన మంత్రులు కూడా తెలుగువారితో మమేకమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. త్వరలో విశాఖలో జరగబోయే సిఐఐ సమ్మిట్ కు అక్కడ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు చంద్రబాబు. ఇక తన పర్యటన విజయవంతమైనట్లు తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు సీఎం.




