Thursday, September 11, 2025 07:05 PM
Thursday, September 11, 2025 07:05 PM
roots

రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో భారతీయలు.. కేంద్రం కీలక ప్రకటన

ఏళ్ళ తరబడి సాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్దంలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు కూడా కనపడటం లేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే దిశగా అడుగులు వేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో రష్యాతో సన్నిహితంగా ఉండే దేశాల విషయంలో అమెరికా కక్ష సాధింపు రాజకీయాలు సైతం చేస్తోంది. ఇదే సమయంలో తాజాగా ఓ వార్త ఆందోళన కలిగించింది.

Also Read : తమిళనాడు పై పవన్ గురి..?

రష్యా వెళ్లిన అనేక మంది భారతీయులను ఉక్రెయిన్‌ లో యుద్ధ భూమిలోకి బలవంతంగా పంపిస్తున్నారని వార్తలు వచ్చిన నేపధ్యంలో.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రష్యా సైన్యంలో చేరవద్దని భారతీయులకు సలహా ఇచ్చింది. ఇటీవల రష్యన్ సైన్యంలోకి భారతీయ పౌరులను నియమించుకున్నట్లు తాము కొన్ని వార్తలు చూసామని.. గత ఏడాది కాలంగా ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఈ వ్యవహారంలో అంతర్లీనంగా ఉన్న సమస్యలు, భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల గురించి చెప్పిందని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Also Read : మెరిసిపోతున్న అనన్య నాగళ్ళ

తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న ఇద్దరు భారతీయ యువకులను నిర్మాణ పనుల సాకుతో తమను రష్యాకు రప్పించారని, బదులుగా యుద్ధం ఫ్రంట్‌లైన్‌ లో మోహరించారని ఆవేదన వ్యక్తం చేసినట్టు జాతీయ మీడియా ఓ కథనం ప్రచురించింది. 2024 నవంబర్‌లో రష్యా స్వాధీనం చేసుకున్న సెలిడోవ్ పట్టణం నుండి ఆ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడారు. కనీసం 13 మంది భారతీయులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్టు జాతీయ మీడియా వెల్లడించింది. స్టూడెంట్ వీసాతో అలాగే పర్యాటకులుగా రష్యా వెళ్ళిన వారిని యుద్ద భూమికి పంపినట్టు జాతీయ మీడియా తెలిపింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్