వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల. 1978 నుంచి పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబం పెత్తనం నడుస్తోంది. పులివెందుల అంటే చాలు.. వైఎస్ అనే పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అలాగే కుప్పం అంటే చంద్రబాబు పేరు గుర్తుకు వస్తుంది. అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. తమదైన రాజకీయాలతో రెచ్చిపోయింది. కుప్పం మునిసిపాలిటీని దౌర్జన్యంగా సొంతం చేసుకుంది. దీంతో కుప్పంలో తొలిసారి మరో పార్టీ జెండా ఎగిరింది. దీనిని టీడీపీ నేతలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వయంగా వై నాట్ 175 అని గెప్పగా ప్రకటించారు. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుందని.. ప్రకటించారు. అయితే ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Also Read : కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్ కోసం తొందరపడుతున్నాడా?
రాజకీయాల్లో పార్టీల మధ్య విభేదాలు సర్వ సాధారణం. కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయాలకు ఎలాంటి ఆస్కారం లేదు. అందుకే చంద్రబాబు తొలి నుంచి అభివృద్ది విషయంలో రాజకీయాలు చేయలేదు. కానీ జగన్ తీరు మాత్రం వేరు. అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. 2014లో అధికారంలో ఉన్న సమయంలో కూడా పులివెందుల నియోజకవర్గానికి కృష్ణా జలాలను అందించారు చంద్రబాబు. కానీ జగన్ మాత్రం.. కుప్పం నియోజకవర్గానికి నీళ్లు అంటూ ట్యాంకర్ ద్వారా తీసుకువచ్చి పోశారు. ఆ తర్వాత నుంచి అటు వైపు చుక్క నీరు కూడా పారలేదు.
ఇక తాజాగా పులివెందులకు ఎన్‌డీఏ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి భారీగా నిధులు కేటాయిస్తోంది. అదే సమయంలో కొత్త ట్రాక్‌ల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తోంది. అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. తాజాగా మరో కొత్త రైల్వే లైన్ పనులు ప్రారంభం కానున్నాయి. కడప జిల్లాలోని పులివెందులలో త్వరలో రైలు కూత వినిపించనుంది. కడప – బెంగళూరు మధ్య కొత్త ట్రాక్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముద్దనూరు, పులివెందుల, ముదిగుబ్బ, శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మించేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.2,505 కోట్లుగా ఉంది.
Also Read : ఎంపీలు, ఎమ్మెల్యేలకు చుక్కలే.. చంద్రబాబు కీలక నిర్ణయం..!
ఇప్పటికే గుంటూరు – గుంతకల్ మధ్య డబ్లింగ్ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. అలాగే నడికుడి – శ్రీకాళహస్తి రైలు మార్గం కూడా రెండో దశ పూర్తి అయ్యింది. రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సూచించారు. కడప జిల్లా నుంచి ఖనిజాలు, స్టీల్, ఉద్యాన పంటలతో పాటు బొగ్గు రవాణా పెద్ద ఎత్తున జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే కడప జిల్లాకు ఉడాన్ స్కీమ్ కింద ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చింది. అలాగే అమరావతి – బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇప్పుడు పులివెందులకు రైలు రావడం వైసీపీ నేతలను కాస్త ఇబ్బంది పెడుతోంది.




