Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

కేంద్ర బడ్జెట్‌పై కోటి ఆశలు..!

మరో రెండు రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు గంపెడాశతో ఎదురు చూస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికంగా పీకల్లోతు అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయో అని మల్లగుల్లలు పడుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 2025-26 వార్షిక ఏడాది బడ్జెట్‌లో ఏపీకి భారీగా కేటాయింపులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు, ఏపీ నేతలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేశారు.

Also Read : ఏబీ వెంకటేశ్వరరావు కు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక కేటాయింపులు కావాలని సీఎం చంద్రబాబు పదేపదే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రిని కోరుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రతిసారి ఇవే అంశాలను గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి కేంద్రం ఆర్థిక భరోసా ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. దీంతో అమరావతిలో మొదటి దశ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2027 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామని చంద్రబాబు ఇప్పటికే హామీ ఇచ్చారు. శరవేగంగా పనులు జరగాలంటే ఆర్థికంగా వెసులుబాటు ఉండాలనేది చంద్రబాబు మాట. అలాగే పోలవరం ప్రాజెక్టుపై కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి పలుమార్లు వినతి పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయాఫ్రం వాల్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీని స్థానంలో కొత్తగా రూ.900 కోట్లతో మరో డయాఫ్రం వాల్ నిర్మిస్తున్నారు. అలాగే హైడల్ విద్యుత్ ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిపై బడ్జెట్‌లో కేటాయింపులు ఏ మేరకు ఉంటాయనే కోణంలో ఏపీ సర్కార్ ఆలోచనలు చేస్తోంది.

Also Read : అన్నా క్యాంటిన్లలో వారికి భోజనం ఉండదు..? సర్కార్ కీలక నిర్ణయం..!

ఇక ఏపీలో పలు జాతీయ రహదారుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. విజయవాడ బైపాస్‌తో పాటు, హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు, రణస్థలం – ఇచ్ఛాపురం 6 లైన్ రోడ్, 214A హైవే పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అమరావతి – అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మార్గానికి ఏ మేరకు నిధుల కేటాయింపు ఉంటుందో అనేది బడ్జెట్‌లో తెలియాల్సి ఉంది. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిర్వహిస్తున్న విమానయాన శాఖకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు చేరుకున్నాయి. ఇందులో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో పాటు గన్నవరం విస్తరణ, అమరావతిలో కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణం, మధురపూడి టెర్నినల్ నిర్మాణం వంటి ప్రాజెక్టులు నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కేంద్రం ఏ మేరకు నిధులు కేటాయిస్తుందో అనేది ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధికి బ్రేక్ పడదని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో ప్రకటించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్