ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతి అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇచ్చిన మాటకు కట్టుపడి ఉన్నారు. అమరావతిలో కీలక ప్రాజెక్టులకు కేంద్రం తన వంతు సహకారం అందిస్తోంది. అలాగే అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధుల మంజూరుతో పాటు బ్యాంకు గ్యారంటీ కూడా ఇస్తోంది. దీంతో అమరావతి పనులు శరవేగంతో ముందుకు సాగుతున్నాయి.
Also Read : సారీ.. చెప్పినట్లు చేయలేకపోతున్నాం..!
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దసరా పండుగ నాటికి ఏపీ సీఆర్‌డీఏ భవనం ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అలాగే ఐకానిక్ భవనాల నిర్మాణంతో పాటు సీడ్ ఆక్సెస్ రోడ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ఇదే సమయంలో పలు కేంద్ర రంగ సంస్థలు కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం స్థలం కేటాయిస్తోంది.
ఇదే సమయంలో ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో నగరాల మధ్య హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మించేందుకు మోదీ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ముంబై – అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు రానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్ – బెంగళూరు నగరాల మధ్య ఎలివేటెడ్ రైల్ కారిడార్ నిర్మించేందుకు కేంద్రం అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఎలైన్‌మెంట్‌కు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది.
Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?
హైదరాబాద్ నుంచి శంషాబాద్ వరకు 38.5 కిలోమీటర్ల కారిడార్ నిర్మిస్తారు. అక్కడ నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేరు వేరు కారిడార్లు నిర్మిస్తారు. హైదరాబాద్ – చెన్నై కారిడార్ కోసం 3 ఎలైన్‌మెంట్లు పరిశీలించారు. ఇందులో 744.57 కి.మీ.ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. తెలంగాణలో 6, ఏపీలో 8, తమిళనాడులో ఒక స్టేషన్ నిర్మించాల్సి ఉంది. శంషాబాద్, నార్కట్ పల్లి, సూర్యాపేట, కోదాడ, మీదుగా అమరావతి, గుంటూరు మీదుగా చీరాల వైపు వెళ్లి.. విజయవాడ – చెన్నై రైల్వే లైన్‌కు సమాంతరంగా నిర్మించాల్సి ఉంది. అమరావతి, గుంటూరు, చీరాల, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడలో స్టేషన్లు నిర్మించాలని ప్రతిపాదన. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ – అమరావతి మధ్య ప్రయాణ సమయం 2 గంటల లోపే. అలాగే అమరావతి నుంచి చెన్నైకు కేవలం 4 గంటల్లోనే చేరుకోవచ్చు అంటున్నారు.