Friday, September 12, 2025 09:35 PM
Friday, September 12, 2025 09:35 PM
roots

సీసీ కెమెరాల చోరీ.. వాళ్లే దొంగలా..?

ఏపీలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన అవకతవకలతో విద్యా శాఖకు కావాల్సినంత చెడ్డ పేరు వచ్చింది. దీంతో ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా విద్యా శాఖ గట్టి చర్యలు తీసుకుంది. గ్రామస్థాయిలోని పరీక్షా కేంద్రాల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో స్వ్కాడ్ ను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పరీక్ష పత్రాల లీకేజ్ వల్ల విద్యార్థుల బంగారు భవిష్యత్తుపై ప్రభావం కూడా చూపింది. ఇక మాస్ కాపీయింగ్ కూడా భారీగానే జరిగింది. దీనిని అరికట్టేందుకు విద్యా శాఖ కఠిన చర్యలు తీసుకుంది. అయితే కొందరు ఆకతాయిల వల్ల విద్యా శాఖకు చెడ్డపేరు వస్తోంది.

Also Read : నువ్వు మొదలపెట్టావ్.. నేను ఆపను.. రజనీకి లావు స్ట్రాంగ్ వార్నింగ్

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రంలో గతంలో అవకతవకలు జరిగిన నేపథ్యంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం 10 గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తొలిరోజు తెలుగు పరీక్షకు హాజరైన సమయంలోనే సీసీ కెమెరాలను గుర్తించిన కొందరు ఆకతాయిలు రెండో రోజు హిందీ పరీక్షను కాస్త జాగ్రత్తగా రాశారు. ఇక అదే రోజు రాత్రి 8 గదుల్లో ఏర్పాటు చేసిన మొత్తం 14 సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం పరీక్షా కేంద్రానికి వచ్చిన సిబ్బంది గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?

స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జేఆర్ పురం పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముందుగా ఆకతాయిలే ఈ పని చేసి ఉంటారని అంతా భావించారు. పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల వల్ల చూసిరాతకు కుదరటం లేదని విద్యార్థులు, లేదా ఆకతాయిలు ధ్వంసం చేసి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేశారు. అయితే ఈ కుట్ర వెనుక ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read : తమ్మినేనికి మ్యూజిక్ స్టార్ట్ అయిందా…?

స్కూల్ సిబ్బంది పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత రికార్డులు పరిశీలించిన పోలీసులకు షాక్ తగిలింది. తొలి రెండు రోజులు కూడా ఎలాంటి ఫుటేజ్ రికార్డు కాలేదు. కెమెరాలు బిగించారు తప్ప… డీవీఆర్‌కు కనెక్షన్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. కొంతమంది సిబ్బంది ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రైవేటు విద్యా సంస్థలతో చేతులు కలిపిన కొందరు సిబ్బంది.. ఈ తరహా చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో పైడి భీమవరం పరీక్ష కేంద్రంలో సిబ్బందిని పూర్తిగా మార్చేశారు. అలాగే ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా జిల్లా ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్