వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నాయకుల్లో వల్లభనేని వంశీ కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా వాళ్లకు సరిపడా వైద్యం ఉంటుందని చాలామంది ఆశించారు. అప్పట్లో నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో అలాగే పాదయాత్ర సందర్భంగా చేసిన కామెంట్స్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. రాజకీయంగా అప్పట్లో కొడాలి నానిని అలాగే వల్లభనేని వంశీని టార్గెట్ గా చేసుకుని ఒకరకంగా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది అనే విషయం చాలా మందిలో క్లారిటీ ఉంది.
వాళ్ళిద్దరినీ ఏదో చేస్తారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల విషయంలో ఎటువంటి అడుగులు పడలేదు. అసలు వారిపై ఒక్క కేసు కూడా ఇప్పటివరకు సరిగ్గా నమోదు కాలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా… అవినీతి కార్యక్రమాలు చేశారనే ఆరోపణలు ఉన్న దానికి సంబంధించిన ఆధారాలు పక్కాగా పట్టుబడినా వాళ్ళిద్దర్నీ మాత్రం స్వేచ్ఛగా వదిలేశారు అధికారులు. వల్లభనేని వంశీ చేసిన కొన్ని కామెంట్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా రక్తం మరిగేలా ఉన్నాయి.
Also Read : ఫలించని కూతురు రాయభారం!
అయినా సరే ఇప్పటివరకు వంశీని అరెస్టు చేసిన పరిస్థితి లేదు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమాలు ఓ రేంజ్ లో జరిగాయి. అలాగే మట్టి తవ్వకాలపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించిన వ్యవహారంపై కూడా సాక్షాలు ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వ్యవహారంలో కూడా ఆధారాలు ఉన్నాయి. అయినా సరే ఎక్కడా కూడా ఆయనకు ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తోంది రాష్ట్రం ప్రభుత్వం.
కొడాలి నాని విషయంలో కూడా ఇదే వైఖరి కనపడుతోంది. గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని చాలా ఆగడాలు గత ఐదేళ్ల కాలంలో చేశారు అనే స్పష్టత చాలా మందికి ఉంది. తొలిసారి అధికారంలోకి రావడంతో ఆయన ఖర్చుపెట్టిన సొమ్మంతా లాక్కునే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున కబ్జాలకు కూడా పాల్పడ్డారు అనే ఆరోపణలు వినిపించాయి. ఎకరాలకు ఎకరాలు ఆయన దోచేశారని అలాగే జగనన్న కాలనీల పేరుతో అవినీతి కార్యక్రమాలు చేశారని అలాగే వాలంటీర్లను భయపెట్టారు అనే ఆరోపణలు ఎన్నో ఉన్నాయి.
అలాగే రేషన్ బియ్యం అక్రమాల్లో కూడా ఆయన హస్తం ఉందనే ఆరోపణలు వినిపించాయి. పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు వచ్చినా… ఇప్పటివరకు వాటి విషయంలో ఎటువంటి చర్యలు లేవు. దీనితో వారితో రాజీ పడిపోయిందా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనే అనుమానాలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య కొడాలి నానిని అరెస్టు చేసేశారు… అరెస్టు చేస్తున్నారు అలాగే వల్లభనేని వంశీని ఏకంగా అరెస్టు చేశారు అనే ప్రచారం జరిగింది. అయినా సరే ఇప్పటివరకు కనీసం వాళ్ళ ఇళ్లకు కూడా పోలీసులు వెళ్లిన దాఖలాలు లేవు.




