ఐదేళ్ల అరాచక పాలన సాగించిన వైసీపీ సర్కార్‌కు ఏపీ ప్రజలు చరమగీతం పాడారు. ఐదేళ్ల పాటు ప్రజలకు చుక్కలు చూపించిన జగన్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి రాలేదు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సైలెంట్‌గా బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మకాం మార్చేశారు. అయితే వైసీపీ అధినేతపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో.. అప్పుడప్పుడు తాడేపల్లి వస్తున్నారు. పార్టీ నేతలతో రివ్యూలు, చావు పరామర్శలు చేసి.. మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారు.
Also Read : లిక్కర్ కేసులో కీలక ముందడుగు.. సంచలనానికి సిద్దం..!
ఇక ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చంద్రబాబు వెల్లడించారు. సూపర్ సిక్స్‌లో ఇచ్చిన మిగిలిన హామీల అమలుకు కూడా తేదీలు ప్రకటించారు. ఇక సూపర్ సిక్స్ హామీలు అమలు కావటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్ల నాలుక మందం అని కూడా ఇటీవల చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. తల్లికి వందనం పైన నిన్నటి వరకు పెద్ద ఎత్తున ప్రశ్నలు కురిపించారు. ఇప్పుడు అందులో లోపాలున్నాయని రంధ్రాన్వేషణ చేస్తున్నారు.
Also Read : ఇంటింటికీ తొలి అడుగు.. పడుతుందా..?
కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఏపీలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారాయి. కూటమి ఎమ్మెల్యేల ఏడాది పనితీరుపై వివిధ సర్వే సంస్థలు నివేదికలు రిలీజ్ చేస్తున్నాయి. నేతల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని.. కానీ సీఎం చంద్రబాబు పైన మాత్రమే నమ్మకం ఉందని రిపోర్టులో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో తాము రాజకీయంగా బలపడేందుకు ఇదే సరైన సమయం అని వైసీపీ అధినేత భావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే ఇప్పటి నుంచే కష్టపడాలనేది.. జగన్‌కు వైసీపీ నేతలు చేస్తున్న సూచన. దీంతో వైసీపీ గెలుపు కోసం జగన్ మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : రేవంత్ కు ఒళ్ళు మండింది.. మరి ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఏంటో..?
2014 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన వైసీపీ.. ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో ఐ ప్యాక్ టీమ్‌తో వైసీపీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో చేశారు. పింక్ డైమండ్, విశాఖ ఎయిర్ పోర్టులో హంగామా, పాదయాత్ర, కోడికత్తి డ్రామా.. చివరికి బాబాయ్ హత్య.. ఇవన్నీ గెలుపు కోసం చేసినవే అనేది బహిరంగ రహస్యం. చివరికి 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఆ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీమ్ నుంచి తప్పుకున్నారు. అయినా సరే.. వైసీపీ మాత్రం ఐ ప్యాక్‌తో ఒప్పందం కొనసాగించింది. ఐదేళ్ల పాటు ఐ ప్యాక్ చెప్పినట్లుగా జగన్ అండ్ కో ఆడారు. చివరికి పెయిడ్ ఆర్టిస్టులతోనే వీడియోలు కూడా చేయించారు. చివరికి విశాఖలో జరిగిన పెట్టుబడుల సమ్మిట్‌లో కూడా ఐ ప్యాక్ టీమ్ హంగామా చేసింది.
Also Read : తెలంగాణలో బీజేపీ షాకింగ్ సర్వే.. టార్గెట్ రేవంత్ కాదా..?
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఐ ప్యాస్ టీమ్ మూట ముల్లె సర్దుకుని వెళ్లిపోయింది. వైసీపీ కూడా ఐ ప్యాక్‌తో తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సిద్ధం సభల్లో ఐ ప్యాక్ టీమ్ చేసిన ఓవర్ యాక్షన్, సోషల్ మీడియాలో మహిళలపై కించపరిచేలా పోస్టులు, విజయవాడలో గులక రాయి దాడి.. ఇలాంటి చిల్లర పనుల వల్లే వైసీపీ ఓడిందని బహిరంగ విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి బెంగళూరులోనే ఉంటున్న జగన్.. భవిష్యత్తు ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐ ప్యాక్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పటికీ.. ప్రశాంత్ కిషోర్ సన్నిహితునితో మాత్రం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఎన్నికల వరకు వైసీపీకి సేవలు అందించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఎన్నికల వరకు పని చేసిన రిషి రాజ్ సింగ్‌ను వద్దని చెప్పిన జగన్.. సీనియర్ వ్యూహకర్తతో ఒప్పందం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ నేతలకు త్వరలోనే ఈ విషయం వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యూహకర్త చెప్పినట్లుగా నడుకోవాలనేది వైసీపీ నేతలకు అధినేత చేస్తున్న సూచన. మరి జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.




