Wednesday, February 4, 2026 07:14 AM
Wednesday, February 4, 2026 07:14 AM

తమిళ సూపర్ స్టార్ అవ్వాలనే అల్లు అర్జున్ ప్రయత్నం ఫలిస్తుందా?

ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్‌లో గణనీయమైన మార్కెట్‌ను స్థిరపరచుకున్నారు. ప్రస్తుతం నార్త్ ఇండియాలో ఆయనకు ఉన్న క్రేజ్, ఖాన్ త్రయం స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే వారి కంటే ఎక్కువగానే ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే, ఎన్నో సంవత్సరాలుగా కేరళలో కూడా అల్లు అర్జున్‌కు అక్కడి టాప్ స్టార్ హీరోలకు సమానమైన మార్కెట్ ఉంది. తెలుగు మార్కెట్ విషయంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆయనకు బలమైన పునాది.

ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి పూర్తిగా తమిళనాడుపై కేంద్రీకృతమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో ఈ తరం సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. మరోవైపు, సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు కారణంగా పరిమిత సంఖ్యలోనే సినిమాలు చేసే అవకాశముంది. ఇక తమిళ బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకరైన అజిత్ కూడా ఇటీవలి కాలంలో సినిమాలపై ఫోకస్ తగ్గించి, రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమిళనాడులో ఏర్పడిన ఈ స్పేస్‌ను ఉపయోగించుకోవాలనే వ్యూహంతో అల్లు అర్జున్ ముందుకు సాగుతున్నారని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read : ట్రంప్ సంచలనం.. 75 దేశాలకు వీసా షాక్..!

ఈ లక్ష్యంతోనే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఒక భారీ ప్రాజెక్ట్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది మే నెలలో పూర్తయ్యే అవకాశముందని సమాచారం. ఈ సినిమా పూర్తైన వెంటనే, మరో ప్రముఖ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని అంచనా. అట్లీ, లోకేష్ కనకరాజ్‌లతో రూపొందే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిస్తే, అల్లు అర్జున్ తమిళనాడులో కూడా తన ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్నట్టే అవుతుంది.

టాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే, ఎన్టీఆర్ కాలం నుంచి ఎన్నో మంది బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ, తమిళనాడులో మాత్రం స్థిరమైన మార్కెట్‌ను పూర్తిస్థాయిలో నిర్మించుకున్న వారు చాలా అరుదు. అప్పట్లో అక్కినేని నాగార్జున నటించిన ‘గీతాంజలి’, ‘శివ’ చిత్రాలు తమిళంలో డబ్ అయి సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలు నాగార్జునకు తమిళ యువతలో మంచి క్రేజ్‌ను తీసుకొచ్చాయి. అయితే, ఆ తర్వాత ఆయన ఆ మార్కెట్‌ను కొనసాగించలేకపోయారు.

Also Read : ఏబీవి రాజకీయ అడుగు: ఒత్తిడి వ్యూహమా లేక స్వతంత్ర ప్రయాణమా?

ఇక నేటి తరం విషయానికి వస్తే, రామ్ చరణ్ ‘మావీరన్’, ‘రగలై’ వంటి చిత్రాలతో తమిళనాడులో భారీ విజయాలను అందుకున్నారు. ఆయనకు కూడా అక్కడ మంచి అభిమాన వర్గం ఉంది. అయినప్పటికీ, ఆయన తమిళ మార్కెట్‌పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు విజయవంతమవుతాయో, తమిళనాడులో ఆయన నిజంగా సూపర్ స్టార్‌గా అవతరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్