వచ్చే నెలలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ నేపధ్యంలో భారత జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయగా, జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. రోహిత్ శర్మను కెప్టెన్ గా కొనసాగించారు సెలెక్టర్లు. ఇక వైస్ కెప్టెన్ గా శుభ్‌మాన్ గిల్ ను ఎంపిక చేసారు. అయితే ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సీరీస్ కు గానూ… బూమ్రా స్థానంలో హర్షిత్ రానా తుది జట్టులోకి వస్తాడు. ఒకవేళ బూమ్రా చాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఫిట్నెస్ సాధించకపోతే మాత్రం రానాను మెగా టోర్నీకి కంటిన్యూ చేయనున్నారు.
Also Read : జనాభా పెరగాలి.. నేషనల్ మీడియాలో చంద్రబాబు కామెంట్స్ వైరల్..!
రోహిత్ శర్మ నేతృత్వంలోని ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇద్దరినీ ఎంపిక చేసారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ను వన్డే జట్టులోకి తీసుకోవడంతో… సిరాజ్ ను పక్కన పెట్టింది యాజమాన్యం. టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది. భారత్ చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది. గ్రూప్ ఏ లో.. భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో పాటు, ఆతిథ్య పాకిస్థాన్‌లు ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, ఫిబ్రవరి 6వ తేదీన ఇంగ్లాండ్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆడనుంది. వన్డేలకు ముందు జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సీరీస్ జనవరి 22 నుంచి కోల్‌కతాలో ప్రారంభం కానుంది. రెండు, మూడో మ్యాచ్‌లు జనవరి 25, 28 తేదీల్లో చెన్నై, రాజ్‌కోట్‌లో జరుగుతాయి. ఈ సిరీస్‌లో నాలుగో గేమ్ జనవరి 31న పూణెలో జరగనుంది. ఫిబ్రవరి 2న టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌కు ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది.
Also Read : పోలవరం కీలక ఘట్టం.. డయాఫ్రం వాల్ ప్రత్యేకతలు ఇవే…!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సింగ్, షమీ, అర్షదీప్, షమీ జైస్వాల్, రిషబ్ పంత్ మరియు రవీంద్ర జడేజా.