రాజకీయంగా పులివెందుల జిల్లా పరిషత్ ఎన్నిక సంచలనంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ ఏకపక్ష విజయాన్ని సాధించగా అక్కడి నుంచి వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్నికలు నిర్వహించారని ఆరోపించింది. ఈ ఆరోపణలపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. పులివెందులలో మళ్ళీ ఎన్నికలకు సిద్దం అని ఆయన సంచలన ప్రకటన చేసారు. తన భార్యతో వెంటనే రాజీనామా చేయించడానికి తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : కూన ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్..!
జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేస్తే రెండు ఎన్నికలు ఒకే సారి కేంద్ర బలగాల పహారాలో నిర్వహించడానికి టీడీపీ సిద్దంగా ఉందని, సవాల్ స్వీకరించే దమ్ము జగన్ కు ఉందా అని ఆయన నిలదీశారు. ఇప్పటి వరకు పులివెందులలో ఒకరకమైన రాజకీయం జరిగిందని ఇక నుంచి వేరే లెవెల్ రాజకీయం జరుగుతుందని, దీనికి వైసీపీ నేతలు సిద్దంగా ఉండాలన్నారు. పార్టీలో చేరికలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేసారు.
Also Read : నిర్మాతలను ముంచిన వార్ 2..? ఎన్టీఆర్, వంశీ మధ్య వార్..?
జగన్ అరాచకాలను చూసి పులివెందుల ప్రజలు ఛీకొట్టారు అని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగినా సరే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసు గురించి ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, కేసును క్లోజ్ చేసారా అనే ప్రజాస్వామ్య వాదులు ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించిన బీటెక్ రవి, ఈ కేసు సుప్రీం కోర్ట్ లో ఉందని ఖచ్చితంగా త్వరలో విచారణ పూర్తి అయి నిందులకు శిక్ష పడటం ఖాయం అన్నారు. వివేకా కేసులో కావాలనే వైసీపీ డ్రామాలు ఆడిందని విమర్శించారు.