Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

18 ఏళ్ళలో తొలిసారి.. బీఎస్ఎన్ఎల్ సరికొత్త రికార్డు

భారత్ సంచార్ నిగం లిమిటెడ్… దశాబ్దాలుగా టెలికాం యూజర్లకు ఎంతో సుపరిచితమైన నెట్వర్క్ ఇది. అయితే 2015 తర్వాత నుంచి క్రమంగా ఈ నెట్వర్క్ తన ప్రాభవం కోల్పోతూ వస్తోంది. ఇదే సమయంలో జియో నెట్వర్క్ ఎంటర్ కావడం బిఎస్ఎన్ఎల్ కు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టింది. దానికి తోడు ఇతర నెట్వర్క్ ల దూకుడు అందుకోలేకపోవడం.. సర్వీస్ విషయంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఇబ్బందులకు గురి చేయడంతో చాలామంది యూజర్లు బిఎస్ఎన్ఎల్ విషయంలో ఆసక్తి చూపించలేదు.

Also Read : ఏకతాటిపైకి పార్టీ.. లోకేష్ కు రూట్ క్లియర్

అయితే గత రెండు మూడేళ్ల నుంచి బిఎస్ఎన్ఎల్ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. టాటా గ్రూప్ టేక్ అప్ చేసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను దగ్గర చేసుకునేందుకు అనేక వ్యూహాలను అవలంబించింది. ఇదే సమయంలో ఇతర నెట్వర్క్ ల రేట్లు పెరగడం కూడా బిఎస్ఎన్ఎల్ కు కలిసి వచ్చిన అంశం. ఇతర నెట్వర్క్ లు నెలనెలా భారీగా రేట్లు పెంచడంతో బిఎస్ఎన్ఎల్ వైపు యూజర్లు మొగ్గు చూపారు. ఇక దానికి తోడు నెట్వర్క్ ను విస్తరించే విషయంలో కూడా బిఎస్ఎన్ఎల్ జాగ్రత్తలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బిఎస్ఎన్ఎల్.. సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది.

Also Read : కడప జిల్లా స్వీప్ చెయ్యాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్

దీనితో 18 ఏళ్ల తర్వాత లాభాల బాట పట్టింది బిఎస్ఎన్ఎల్. ఈ ఏడాది క్యూ 4లో 250 కోట్ల రూపాయల ఆదాయం గడించినట్లు పేర్కొంది. 18 ఏళ్లలో వరుసగా రెండు త్రైమాసికాల్లో లాభాలు పొందడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. దీనితో బిఎస్ఎన్ఎల్ నష్టాలు 5,370 కోట్ల రూపాయల నుంచి 2, 247 కోట్ల రూపాయలకు తగ్గాయని ప్రకటించింది. 5 జి,4 జి నెట్వర్క్ విస్తరణ పై దృష్టి పెట్టడంతోనే ఈ లాభాలు వస్తున్నట్లు పేర్కొంది. అలాగే సరసమైన ధరలకు ఆఫర్లు ఇవ్వటం తమ కంపెనీకి కలిసి వచ్చిందని బిఎస్ఎన్ఎల్ చైర్మన్ ప్రకటించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్