Friday, September 12, 2025 11:42 PM
Friday, September 12, 2025 11:42 PM
roots

బీఆర్ఎస్‌లో జూబ్లీహిల్స్ వార్..!

జూబ్లీహిల్స్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా మూడున్నరేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికపై అన్ని పార్టీల నేతలు దృష్టి సారించాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారతీయ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ గట్టి పట్టుదలతో ఉంది. ఇక ఈ స్థానాన్ని గెలుచుకుని హైదరాబాద్ సిటీలో తమకు కూడా బలముందని చెప్పుకునేందుక కాంగ్రెస్ ప్లాన్ వేస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే.. దానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే మొదలుపెట్టాలనేది బీజేపీ నేతల ప్లాన్.

ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. అటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే సర్కార్‌లో టీడీపీ, జనసేన భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. దీంతో ఈ పొత్తును ఇలాగే కొనసాగించాలనేది మూడు పార్టీల నేతల అభిప్రాయం. జూబ్లీహిల్స్‌లో జరిగే ఉప ఎన్నికలో టీడీపీ తరఫున నందమూరి సుహాసినిని పోటీలో నిలబెట్టాలనేది చంద్రబాబు ప్లాన్. ఇందుకోసం ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు కూడా జరుపుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టు ఉందనేది ఈ ఎన్నిక ద్వారా రుజువు చేయాలనేది చంద్రబాబు వ్యూహం. ఈ ఎన్నికలో గెలుపుతో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ఈరోజు మీ రాశి ఫలితాలు ( 04-07-2025)

కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ క్రికెటర్ అజారుద్ధీన్ పేరు బాగా వినిపిస్తోంది. ఎంఐఎం పార్టీ మద్దతు కూడా అజారుద్దీన్‌కు ఉంటుందని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎంఐఎం మద్దతిస్తే సునాయాసంగా గెలుస్తామనేది కాంగ్రెస్ నేతల మాట. ఇదే సమయంలో నవీన్ యాదవ్, విజయా రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో సీటు కావడంలో ఈ ఎన్నికపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింగి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ఆ లోటు తీర్చుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Also Read : కొనసా…గుతోన్న ఏసీబీ విచారణ..!

ఇదే సమయంలో భారతీయ రాష్ట్ర సమితి నేతలకు మాత్రం ఈ టికెట్ కేటాయింపు కాస్త తలనొప్పిగా మారింది. మాగంటి గోపీనాథ్ స్థానంలో ఈ టికెట్ ఎవరికి కేటాయించాలనేది ఇప్పుడు బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 2014లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు గోపీనాథ్. ఆ తర్వాత అనూహ్యంగా కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. అయితే అనారోగ్యం కారణంగా గోపీనాథ్ మృతి చెందడంతో ఇప్పుడు ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ టికెట్‌ను గోపీనాథ్ భార్య సునీతకు ఇస్తారని అంతా భావించారు. సునీతకు ఇస్తే సానుభూతి ఓట్లు వస్తాయని.. అప్పుడు సునాయాసంగా సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవచ్చనేది బీఆర్ఎస్ నేతల ప్లాన్. అయితే అనూహ్యంగా టికెట్ తనకు ఇవ్వాలని గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కోరుతున్నారు.

Also Read : అప్పుడు వైఎస్ సునీత, ఇప్పుడు సింగయ్య భార్య.. జగన్ ఫార్ములా

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్ 66లోని తన కార్యాలయంలో మాగంటి గోపీనాథ్ సంతాప సభ నిర్వహించారు. తల్లి మహానంద కుమారితో కలిసి గోపీనాథ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. 1983 నుంచి తమ కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతోందని.. 2014 నుంచి తన తమ్ముడు గోపీనాథ్ గెలుపు కోసం తాను కూడా పని చేసినట్లు వెల్లడించారు. తన తమ్ముడితో కలిసి పని చేశానని.. అన్ని డివిజన్లలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో తనకు చక్కటి పరిచయాలున్నాయన్నారు. గోపీనాథ్ లేడని ఎవరు భయపడవద్దని భరోసా ఇచ్చిన వజ్రనాథ్.. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనకు టికెట్ ఇస్తే తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వజ్రనాథ్. తన పెద్ద కుమారుడిని కూడా ఆదరించాలని మహానంద కుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ఇరుకున పెట్టాయి. ఉప ఎన్నికల్లో గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇస్తారా… లేక సోదరుడు వజ్రనాథ్‌కు ఇస్తారా అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్