Friday, September 12, 2025 11:16 PM
Friday, September 12, 2025 11:16 PM
roots

రేవంత్ దూకుడితో ఆత్మరక్షణలో గులాబీ దండు

తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి దూకుడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డిని పరిపాలనలో చాలా తక్కువ అంచనా వేసిన బీఆర్ఎస్ కు ఆయన తన పాలనతో చుక్కలు చూపిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు సహా పెట్టుబడుల విషయంలో స్వయంగా సిఎం జోక్యం ఇప్పుడు చంద్రబాబు స్టైల్ ని గుర్తు చేస్తోంది. రైతు రుణమాఫీ విషయంలో ఆయన ప్రదర్శించిన దూకుడు దెబ్బకు ఇప్పుడు గులాబీ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. గత ప్రభుత్వంలో పెట్టుబడుల విషయం కేసీఆర్ ఎక్కడా జోక్యం చేసుకోలేదు.

ప్రతీ విషయంలో కేటిఆర్ నేను ఉన్నా అనే వారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి హోదాలో ప్రతీ శాఖలో తన మార్క్ ని ప్రదర్శిస్తూ ఇతర మంత్రులలో కూడా ఉత్సాహం నింపుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన రేవంత్ రెడ్డి… విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఎక్కడా విశ్రాంతి తీసుకోలేదు. విదేశీ పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఈ రోజు ఢిల్లీ లో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబులు సమావేశం అవుతారు. పెట్టుబడులే లక్ష్యంగా విదేశీ పర్యటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి… స్వదేశంలోనూ అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కలిసి అవకాశం ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి అయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన అంశాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఇక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం పూర్తి స్వేచ్చనిస్తోంది. దీనితో రాష్ట్రంలో ఇచ్చే పదవులపై కూడా రేవంత్ అభిప్రాయం తర్వాతనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఒక వైపు పాలనలో మరో వైపు పార్టీ పరంగా రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేయడంతో అసంతృప్తిగా ఉన్న నాయకులు కూడా సెట్ అయిపోయారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్