Sunday, March 22, 2026 04:58 PM
Sunday, March 22, 2026 04:58 PM

పరువు తీస్తున్నారు కదరా అయ్యా..!

172 ఏళ్ల భారతీయ రైల్వే వ్యవస్థ ఆధునీకం వైపు పరుగులు పెడుతోంది. వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్‌ రైలు ఇప్పటికే ఆదరణ పొందింది. ఇక త్వరలోనే బుల్లెట్ రైలు కూడా అందుబాటులోకి రానుంది. ముంబై – అహ్మదాబాద్ మధ్య ఆగస్టు 2027 నాటికి బుల్లెట్ రైలు పరుగులు పెట్టనుంది. అలాగే ప్రపంచంలోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జ్ చినాబ్ రైల్ బ్రిడ్జ్.. ఇది కూడా జమ్ము కశ్మీర్‌లోనే ఉంది. ఇక పర్యాటకుల కోసం ఎన్నో రకాల రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కొందరు ఉద్యోగులు, భారతీయుల కారణంగా భారత్ పరువు బజారున పడుతోంది.

Also Read : హైదరాబాద్ లో ప్రభాస్ ఇల్లు గురించి తెలిస్తే..

రైళ్లల్లో ఎన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినా సరే.. సగటు భారతీయుడి తీరు మాత్రం మారటం లేదు. మరీ ముఖ్యంగా జనరల్ బోగీలో ప్రయాణించే తీరు ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తోంది. బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారి తీరు అత్యంత దారుణంగా ఉంది. ఎదుటి వాళ్లు ఏమనుకుంటున్నారనే కనీస స్పృహ కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బ్రిటన్ నుంచి వచ్చిన టూరిస్ట్.. రైలులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తన ఎదురుగా కూర్చున్న వ్యక్తి పదే పదే తన సీటుపైన కాళ్లు పెడుతున్నాడని.. తీయమంటే.. సరే అంటున్నాడు తప్ప.. తీయలేదని వీడియో తీశాడు. టూరిస్ట్ వీడియో తీస్తున్నా సరే.. ఆ యువకుడు మాత్రం కాలు అలాగే పెట్టి.. గుర్రుగా చూస్తున్నాడు తప్ప.. కాలు మాత్రం తీయలేదు. ఇక మరో వీడియోలో రైల్వేలో టాయి‌లెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై వీడియో తీశాడు. ఇద్దరు బ్రిటన్ టూరిస్టులు రైలులో సీటు దొరకలేదని.. టాయిలెట్ దగ్గర నిలబడి ప్రయాణం చేశారు. ఆ వీడియోలో స్థానికులు వారిద్దరినీ దూరంగా వెళ్లండి పని పదే పదే చెప్పడం పట్ల టూరిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విదేశీయుల ముందు భారత్ పరువు తీస్తున్నారు కదా అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : నేనేంటో త్వరలో చూస్తారు.. ఆ జిల్లా నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

ఇక తాజాగా జార్ఖండ్‌లో జరిగిన ఓ అంశం.. రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. లగేజ్ వ్యాన్‌లో నుంచి పార్సిల్స్‌ను విసిరేస్తున్నారు. కొన్ని పార్సిల్స్ అయితే పట్టాల పైన పడేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ యువకుడు వీడియో తీశాడు. రైల్వే ఉద్యోగుల నిర్లక్ష్యం ఎలా ఉందో చూడండి.. ఈ పార్సిల్స్‌లో మీ అమ్మ మీ కోసం పంపిన లడ్డూలు ఉండొచ్చు.. మీ విలువైన లాప్ టాప్ అయినా ఉండొచ్చు.. కానీ.. అవి ముక్కలైతే.. మాకేం సంబంధం లేదంటారు రైల్వే ఉద్యోగులు.. అంటూ వ్యాఖ్యానించాడు. అయితే యువకుడు వీడియో తీస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది.. ముందు వీడియో ఆపు.. ఇటు రా.. అని పిలిచాడు. అయితే యువకుడు వెళ్లకపోవడంతో.. ఆ ఉద్యోగి మాత్రం తన పని ఆపేసి.. ఆ పార్సిల్స్ అన్నీ అక్కడే పడేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. రైల్వే వ్యవస్థ ఇంత దారుణంగా ఉందా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్