Wednesday, February 4, 2026 02:31 PM
Wednesday, February 4, 2026 02:31 PM

బ్రేకింగ్: ప్రకాశం జిల్లాలో కీలక మార్పులు

జిల్లాల పునర్విభజనకు సంబంధించి దాదాపు ఆరు నెలలుగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కొన్ని జిల్లాలకు సంబంధించి వివాదాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొన్ని కీలక ప్రాంతాలకు సంబంధించి అడుగులు పడ్డాయి. అయితే ఇటీవల తీసుకున్న ఓ నిర్ణయం మాత్రం వివాదాస్పదమైంది. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటుతోపాటుగా రెవిన్యూ డివిజన్లకు సంబంధించిన అంశం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మరి కొన్ని జిల్లాలకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.

Also Read : బీజేపీలో దొంగలు పడ్డారు.. కోవర్టుల గోల..!

ఇక తాజాగా రెవిన్యూ డివిజన్, జిల్లాల అంశానికి సంబంధించి ఒక కీలక అడుగుపడే అవకాశాలు కనబడుతున్నాయి. తాజాగా జిల్లాల పునర్విభజనకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష జరిపారు. రాజంపేటను కడపలో, ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన రాయచోటిని మదనపల్లిలో కలిపే దిశగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. దొనకొండ, కురిచేడులో మార్కాపురం జిల్లాలో, పొదిలిని ప్రకాశం జిల్లాలో, గూడూరును నెల్లూరులో, రైల్వే కోడూరులో తిరుపతిలో కలిపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం కూడా తీసుకుందని.. దానికి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారని సమాచారం.

Also Read : అన్నీ ఉత్త మాటలే.. మేము సవాల్ చేస్తమంతే..!

అదేవిధంగా ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలతో 29కి జిల్లాల సంఖ్య పెరుగుతుంది. అయితే తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్య 28 మాత్రమే ఉండే అవకాశం ఉంది. కొన్ని సమస్యలతో ఒక జిల్లాను తగ్గించేదిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన మూడు జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రేపు మరోసారి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఎల్లుండి క్యాబినెట్ ముందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక రానుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత ఈ నెల 31న కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. గ్రేటర్ విజయవాడకు సంబంధించిన అంశంపై కూడా చర్చ జరిగే సూచనలు ఉన్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్