వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగే సంకేతాలే కనపడుతున్నాయి. వైసీపీ అగ్రనేత ఆ పార్టీలో నెంబర్ 2 గా చెప్పుకునే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది. జగన్ రాజకీయ జీవితంలో విజయసాయిరెడ్డిది కీలక పాత్ర. ఆయన రాజీనామా చేయడంతో ఆ తర్వాత ఎవరు రాజీనామా చేస్తారనే దానిపై వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చలు నడుస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Also Read : మంత్రి కొండపల్లి బ్లడ్ డొనేషన్ రికార్డ్.. దుమ్మురేపిన క్యాడర్…!
గత కొన్నాళ్లుగా జనసేన పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్న బొత్స సత్యనారాయణ త్వరలోనే ఆ పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే పార్టీ నాయకత్వానికి ఇదే విషయమై బొత్స క్లారిటీ ఇచ్చేశారు. అటు తన సన్నిహితుల వద్ద కూడా తాను పార్టీ మారబోతున్నట్లు ప్రకటించారు. గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిని నిలబెట్టలేదు కూటమి. గెలిచే అవకాశం లేకపోవడంతో ఆ స్థానాన్ని వదులుకుంది ఎన్డీఏ.
Also Read : వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతుబంధు దందా
ఇక బొత్స సత్యనారాయణ వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతుంది. ఆయనకు మెగాస్టార్ చిరంజీవికి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. దీనితోనే ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ కూడా బొత్స రాకను స్వాగతించినట్లు సమాచారం. విజయనగరం జిల్లాలో బొత్స సత్యనారాయణ వస్తే పార్టీకి కచ్చితంగా బలం చేకూరుతుందని పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఇది బలం చేకూర్చే అంశమే. ఆయన పార్టీ మారితే కచ్చితంగా ఇతర వైసీపీ నేతలు కూడా కొంతమంది జనసేన వైపు చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనిపై రాబోయే వారం రోజుల్లో కీలక ప్రకటన వచ్చే సంకేతాలు కనపడుతున్నాయి.