పహల్గాం ఉగ్రదాడి తర్వాత తెలుగు రాష్ట్రాలు కూడా భయపడిన మాట అక్షరాలా నిజం. కేంద్ర ప్రభుత్వం కూడా ఉగ్రవాదుల విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మన తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాదుల కదలికలు కంగారు పెట్టాయి. విజయవాడ, విజయనగరంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విజయవాడలో విదేశీయులు అక్రమంగా ఉంటున్నారు అనే సమాచారం కూడా ప్రజలను, ప్రభుత్వాన్ని మరింతగా కంగారు పెట్టేసింది.
Also Read : టీం సెలెక్షన్ పై గంగూలి అసహనం.. బౌలర్లు ఎక్కడ..?
ఇదిలా ఉంచితే. ఇప్పుడు రాయలసీమలో కూడా ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాయచోటిలో 30 ఏళ్లుగా స్థావరాలు ఏర్పరచుకున్న ఉగ్రవాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖి, మహమ్మద్ మన్సూరు అలీని 3 రోజుల కిందట ఐబీ అధికారులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ విచారించారు.
Also Read : అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటన..!
ఐబీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత రాయచోటి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసారు. వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి అనేక పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్‌కేస్ బాంబులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. బాంబులు తయారు చేసే మాడ్యూల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అబూబకర్ సిద్ధిఖి అలియాస్ అమానుల్లా, ఆయన భార్య షేక్ సైరాబానుపై ఉపా యాక్ట్, పేలుడు పదార్థాల చట్టం, ఆర్మ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. మరో కేసులో ఉగ్రవాది షేక్ మన్సూర్ అలీ, ఆయన భార్య షమీం పైన ఇవే సెక్షన్లు వర్తింపజేస్తూ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇక షేక్ సైరా భాను, షేక్ షమీంను అరెస్ట్ చేసి రాయచోటి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.




