రాజమౌళి – మహేష్ బాబు సినిమా అనగానే.. బాలీవుడ్ మీడియా కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కడ వరకు వచ్చింది.. అసలు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది అనే విషయాలపై కాస్త ఎక్కువగానే దృష్టి పెట్టింది. రాజమౌళి సినిమాలకు వరల్డ్ వైడ్ గా క్రేజ్ ఉండటంతో.. ఈ సినిమాను బాలీవుడ్ సీరియస్ గానే తీసుకుంది. ఇక బాలీవుడ్ గురించి ప్రచురించే పత్రికలు, వెబ్సైట్ లు అన్నీ కూడా ఈ సినిమాపై ఫోకస్ పెట్టాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ అప్డేట్ ను అక్కడి మీడియా బయటపెట్టింది.
Also Read : సినిమాల్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే.. స్టోరీ లైన్ కూడా చెప్పేశారు…!
ఈ సినిమాకు రామాయణానికి లింక్ ఉందని.. ఒక సంచలన విషయాన్ని బయటకు తీసింది బాలీవుడ్ మీడియా. రామాయణంలో హనుమంతుడు.. సంజీవని తీసుకొచ్చే సంఘటన ఆధారంగా ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని.. ఈ సినిమాకు కాశీకి లింక్ ఉందని.. అందుకే హైదరాబాదులో కాశి సెట్ వేసి సినిమా షూటింగ్ జరుపుతున్నారని.. బాలీవుడ్ మీడియా రాస్కొచ్చింది. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పాత్ర కూడా పౌరాణిక కథల మాదిరిగా ఉంటుందని చెప్పింది.
Also Read : రెబల్ స్టార్ కి సందీప్ వంగ కండీషన్లు.. వర్క్ అవుట్ అయ్యేనా?..!
ఆమె పాత్రను అంత పవర్ఫుల్ గా రాజమౌళి డిజైన్ చేశారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిస్సాలో జరుగుతుంది. అక్కడి దేవమాలి అనే పర్వతంపై రాజమౌళి టీం.. ఇప్పటికే వర్కౌట్ స్టార్ట్ చేసింది. మహేష్ బాబు ప్రియాంక చోప్రా ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఒడిస్సాలో షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత.. విదేశాల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు రాజమౌళి. తన గత సినిమాల కంటే ఈ సినిమా విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నారు. షూటింగ్ లొకేషన్స్ కూడా ముందుగానే ఫైనల్ చేసి పెట్టుకుని టైం వేస్ట్ చేయడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది సంక్రాంతి టైం కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో కమ్ డైరెక్టర్.. పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. అతను కూడా ఒడిస్సా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.