Saturday, September 13, 2025 01:23 AM
Saturday, September 13, 2025 01:23 AM
roots

ఎమ్మెల్యేలు జారిపోతారా..? కాచుకు కూర్చున్న బిజెపి…!

తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితిలో ఇప్పుడు కేటీఆర్ అరెస్టు వ్యవహారం భయం పట్టుకుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ.. కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. ఇక గులాబీ పార్టీ కూడా ఆశించిన స్థాయిలో పోరాటం చేయలేకపోతోంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు కేటీఆర్ పోరాటం చేసి కెసిఆర్ లేని లోటును తీర్చే ప్రయత్నం చేసినా ఇప్పుడు కేటీఆర్ అరెస్టు అయితే మాత్రం పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది.

Also Read : రేవంత్ ను జాగ్రత్తగా తిట్టిన కేటిఆర్…!

అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేల్లో ఇప్పటికే భయం మొదలైంది. ఒకవేళ కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేస్తే ఏం చేయాలనే దానిపై కొంతమంది ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు నలుగురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బిజెపి కూడా ఈ విషయంలో కాస్త సీరియస్ గానే దృష్టి సారిస్తోంది. కేటీఆర్ అరెస్టు అయితే కచ్చితంగా తమకు లాభమనే భావనలో బిజెపి నేతలు ఉన్నారు. కేటీఆర్ ను అదుపులోకి తీసుకుంటే కచ్చితంగా ఆయన ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదు అనే ఒపీనియన్ కూడా రాజకీయ వర్గాల్లో ఉంది.

Also Read : ఐపిఎల్ కు కోహ్లీ దూరం..? కౌంటీ క్రికెట్ పై ఫోకస్…!

ఒకవేళ అదే జరిగితే మాత్రం గులాబీ పార్టీ కచ్చితంగా కష్టాలు పడే సంకేతాలు కూడా ఉన్నాయి. చాలామంది కేటీఆర్ సన్నిహితులే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. హరీష్ రావు ఎంతవరకు పోరాటం చేస్తారనేది కూడా చెప్పలేని పరిస్థితి. అటు కేసీఆర్ కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. కనీసం కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉన్నా సరే ఆయన బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. కేటిఆర్ అరెస్ట్ విషయంలో ముందు ధైర్యంగా ఉన్న గులాబీ పార్టీ… ఇప్పుడు మాత్రం భయపడుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్