తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి విషయంలో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. వైసీపీ నేతలను అదుపులోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు పోలీసులు. నిన్న హైకోర్ట్ బెయిల్ తిరస్కరించడంతో రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతల కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పి రెడ్డి, జోగి రమేష్, తలసీల రఘురాం సహా పలువురు నేతల మీద దృష్టి పెట్టారు.
నిన్న సాయంత్రం నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవాలని భావించినా అది సాధ్యం కాలేదు. ఆయన ఇంటి వద్దకు వెళ్ళిన పోలీసులు వెనక్కు తిరిగారు. నందిగాం సురేష్ ను హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి గుంటూరు తీసుకొచ్చారు. టిడిపి జాతీయ కార్యాలయంపై దాడి కేసులో అదుపులోకి తీసుకున్నారా లేక మరో కేసు విషయంలోనా అనే దానిపై మాత్రం పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఆయనపై పలు కేసులను కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది.
Read Also : వరద సహాయ చర్యల్లో మొహం చాటేసిన వైసీపీ నాయకులు
ఇప్పటికే హైకోర్టు ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టేయడంతో పోలీసులు రంగంలోకి దిగి తమ పని తాము చేస్తున్నారు. నిన్న ఆయనకు నోటీస్ ఇచ్చేందుకు ఉద్దండ్రాయుని పాలెం వెళ్ళిన పోలీసులు… అక్కడ లేకపోవడంతో వెనక్కు వచ్చారు. హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం రావడంతో… సిగ్నల్ ట్రేస్ చేసి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. అవినాష్ ఫోన్ లు మారుస్తూ తిరుగుతున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఫోన్ లను కూడా ట్రేస్ చేస్తున్నారు.