Friday, September 12, 2025 05:56 PM
Friday, September 12, 2025 05:56 PM
roots

ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి..?

తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, సోదరి ఎంపీ, బావగారు కూడా మాజీ మంత్రి, ఒక అన్న మాజీ మంత్రి, మరో అన్న ఎమ్మెల్యే, మరిది కూడా మాజీ ఎమ్మెల్యే… అయినా సరే.. ఆమె మాత్రం ఎప్పుడు రాజకీయాల గురించి చర్చించలేదు. అసలు రాజకీయాలకు నాకు ఏమిటి సంబంధం అని కూడా కొన్నిసందర్భాల్లో అన్నారు. ఏదో వ్యాపారం చేసుకుంటూ.. సామాజిక సేవ కార్యాక్రమాలు నిర్వహిస్తూ… తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎవరో కాదు.. నారా భువనేశ్వరి. హెరిటెజ్ సంస్థ ఛైర్మన్‌గా వందల కోట్ల విలువైన వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కూడా. విపత్తుల సమయంలో తమ వంతు సాయం అందిస్తున్నారు. పలుమార్లు రాజకీయాల గురించి ఎవరైనా ప్రస్తావించినా కూడా… చిరునవ్వుతో సరిపెట్టారు తప్ప.. జవాబు చెప్పలేదు.

Also Read : వాట్సాప్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే కొద్దిరోజులుగా నారా భువనేశ్వరి తీరు చూసిన వారికి ఎవరికైనా సరే.. కొంత ఆశ్చర్యం కలుగుతుంది. తరచూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ వేదికలపై కనిపిస్తున్నారు. ప్రజలతోనే ఎక్కువ గడిపేస్తున్నారు. ఇదంతా గమనించిన వారికి… ఆమె త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారనే మాట అంటున్నారు. అవును.. పరిస్థితులు గమనిస్తే.. నిజమే.. అనేలా ఉన్నాయి. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత నారా భువనేశ్వరి తీరులో బాగా మార్పు వచ్చింది. చంద్రబాబు కోసం రాజమండ్రిలోనే మకాం వేశారు. దీక్ష చేశారు. అలాగే బాధితులను పరామర్శించారు. ఆర్థిక చేయూత అందించారు. అదే సమయంలో చంద్రబాబు చేసిన పనుల గురించి సవివరంగా వివరించారు. తనపై పడిన నిందలకు కూడా ఘాటుగానే బదులిచ్చారు భువనేశ్వరి. ఇక ప్రతిసారి మాదిరిగానే కుప్పం ఎన్నికల ప్రచార బాధ్యతలను భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు. చంద్రబాబు భారీ మెజారిటీతో గెలిచేందుకు తనవంతు కృషి చేశారు. నామినేషన్ ప్రక్రియ మొదలు… పోలింగ్ డే వరకు కుప్పంలోనేల ఉన్నారు భువనేశ్వరి.

Also Read : ఒక్క ఫోటోతో షేక్ అవుతున్న టీడీపీ సోషల్ మీడియా

ఎన్నికల్లో పార్టీ గెలిచిన తర్వాత మహిళా శక్తి పేరుతో విజయవాడలో పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇక కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబుకు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి. తనను వరుసగా ఆదరిస్తున్న కుప్పం ప్రజల కోసం ఏమైనా చేస్తా అంటూ గతంలో పలుమార్లు చెప్పారు కూడా. ఇప్పుడు ఇదే బాధ్యతను నారా భువనేశ్వరి భూజానికెత్తుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో చంద్రబాబు కుప్పంలో రెండుసార్లు పర్యటించగా.. భువనేశ్వరి మాత్రం నాలుగు సార్లు పర్యటించారు. వచ్చిన ప్రతిసారి కూడా నాలుగు రోజుల పాటు కుప్పంలోనే మకాం వేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలను సందర్శిస్తున్నారు. గ్రామ సభల్లో పాల్గొంటున్నారు కూడా. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా తోపుడు బండ్లు, మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్నారు. రైతులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు స్థానంలో నేను పోటీ చేయమంటారా అంటూ ప్రశ్నలు కూడా వేస్తున్నారు. పైకి నవ్విస్తున్నప్పటికీ… కుప్పం నియోజకవర్గం నుంచి భవిష్యత్తులో భువనేశ్వరి పోటీ చేస్తారేమో అనే మాట బలంగా వినిపిస్తోంది.

Also Read : ఎన్నారైలకు చంద్రబాబు పిలుపు..!

భువనేశ్వరి కుప్పం పర్యటనలో పార్టీ నేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు లేకుండా చూసుకుంటున్నారు. పల్లెల పర్యటనల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందించడం, మహిళలు, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతలతో కూడా భువనేశ్వరి మాట కలుపుతున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పైకి మాత్రం సేవా కార్యక్రమాలు కనిపిస్తున్నప్పటికీ… దీని వెనుక ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉందేమో అనే అనుమానులు బలంగా వినిపిస్తున్నాయి. భర్తకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా భువనేశ్వరి కూడా ప్రత్యేక దృష్టి సారించారు. వారిద్దరి వరుస పర్యటనలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్