Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

నారా చంద్రబాబు నాయుడు.. C/o అమరావతి

అమరావతి పునర్నిర్మాణం పై దృష్టి పెట్టిన సిఎం చంద్రబాబు, మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అటు ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఏర్పడింది. ఇక వైసీపీ నాయకుల నోళ్ళు మూతపడ్డాయి. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అమరావతిలో శాస్వత నివాసం ఏర్పాటు చేసుకోనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ లో నివాసం ఉంటున్న చంద్రబాబు నాయుడు ఇక అమరావతిలోనే ఉండనున్నారు. నూతన నివాసాన్ని నిర్మించేందుకు నారా – నందమూరి కుటుంబాలు సిద్దమయ్యాయి. నూతన రాజధాని పనులతో పాటుగా చంద్రబాబు నివాస పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

Also Read : మాట తప్పాడు.. మడమ తిప్పాడు..!

చంద్రబాబు నివాసం అమరావతి ప్రాంతంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతోంది అంటోంది మీడియా. బుధవారం నందమూరి – నారా కుటుంబాల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరగబోతోంది. రేపు ఉదయం చంద్రబాబు నివాసానికి భూమి పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. అటు సచివాలయం ఇటు ఏపీ అత్యున్నత న్యాయస్థానం మధ్యలో చంద్రబాబు నివాసం ఉండనుంది. ఇక రంగంలోకి దిగిన అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థ నిర్మించనుంది. చంద్రబాబు నివాసానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

Also Read : అమరావతిలో కొత్త పోలీస్ స్టేషన్.. ఎందుకంటే..!

చంద్రబాబు నివాసంలోనే హెలిపాడ్ నిర్మాణం చేపట్టనున్నారు. వ్యక్తిగత నివాసాన్ని అధికారిక నివాసంగా మార్చుకునే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉండవల్లి కరకట్ట వెంటనే చంద్రబాబు అద్దెనివాసం ఉండేది. హైదరాబాదులోనే చంద్రబాబు ఇల్లు ఉందని ప్రతిపక్షాల విమర్శలు గతంలో పెద్ద ఎత్తున వచ్చాయి. ప్రతిపక్షాల విమర్శలకు చంద్రబాబు ఇంటి నిర్మాణం చెంపపెట్టులా ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు నివాసం ఏర్పాటు తర్వాత అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్