Monday, October 27, 2025 11:57 PM
Monday, October 27, 2025 11:57 PM
roots

యుద్ధం మొదలైందా..? పాక్ టార్గెట్ చేసిన సిటీలు ఇవే

తమ దేశ ఉగ్రవాద శిభిరాలపై భారత సైన్యం దాడులు చేయడంతో.. పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. గురువారం నాడు పాకిస్తాన్ ప్రతీకార దాడులకు భారత సాయుధ దళాలు తీవ్రంగా స్పందించాయి. మే 7-8 రాత్రి ఉత్తర, పశ్చిమ భారత్ లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా భారత్ అడ్డుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్ తన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ ద్వారా అన్ని డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంది.

Also Read : మన సైన్యం బలమెంత.. యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటీ..?

పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని భారత్ స్పష్టం చేసినా.. పాక్ మాత్రం భారత అర్మీని టార్గెట్ చేసింది. మే 7-8 రాత్రి అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, లూథియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరలై మరియు భుజ్‌లతో సహా అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు మరియు క్షిపణులను ఉపయోగించింది. ఈ క్షిపణి దాడులను ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్ మరియు వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

Also Read : ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫోటోలు బయటపెట్టిన వాస్తవాలు

పాక్ సైన్యం టార్గెట్ చేసిన నగరాలు ఒకసారి చూస్తే… అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తర్లై, భుజ్ నగరాలను పాక్ టార్గెట్ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెంధార్ మరియు రాజౌరి సెక్టార్ లలో పాకిస్తాన్ మోర్టార్లు, భారీ క్యాలిబర్ ఫిరంగులతో.. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల తీవ్రతను పెంచింది. పాక్ దాడులు ఆపే వరకు తాము ఆపేది లేదని భారత్ స్పష్టం చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్