Friday, August 29, 2025 09:31 PM
Friday, August 29, 2025 09:31 PM
roots

సెలూన్ షాపుల్లో జాగ్రత్త.. వైద్య నిపుణుల వార్నింగ్..!

ఈ రోజుల్లో వైరస్ లు ఎలా విస్తరిస్తాయి, సరికొత్త రోగాలు ఏ విధంగా ఇతరులకు సంక్రమిస్తాయనేది చెప్పడం నిపుణులకు కూడా కష్టంగానే ఉంది. ఎన్నో రోగాలు మనం చేసే చిన్న చిన్న తప్పులతో కొని తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు హైపటైటిస్ వ్యాధి రావడానికి గల సంచలన కారణాలను నిపుణులు వెల్లడించారు. తాజాగా ప్రముఖ డాక్టర్ విక్రమ్ వోరా, హెపటైటిస్ కేసుల పెరుగుదలకు కారణమయ్యే విషయాలను వెల్లడించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్లకు పైగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడినట్టు తెలిపారు.

Also Read : బెజవాడలో ఆపిల్ స్టోర్..? టెక్ దిగ్గజం కీలక నిర్ణయం..!

వీరిలో 248 మిలియన్ల మందికి ఈ వ్యాధి దీర్ఘకాలికంగా సోకినట్లు అంచనా వేసినట్టు పేర్కొన్న ఆయన.. ఎందుకు ఈ వ్యాధి సోకుతుందో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పచ్చబొట్లు, టీకాలు, వైద్య చికిత్సల కారణంగా ఈ వ్యాధి విస్తరిస్తునట్టు వెల్లడించారు. టాటూ వేయించుకునేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే వ్యాధి విస్తరిస్తోందని పేర్కొన్నారు. చాలా మంది తక్కువ ధరకే టాటూలు వేయిస్తున్నారని, సూదులు మార్చకపోవడంతోనే, ఈ వ్యాధి విస్తరిస్తోందని హెచ్చరించారు.

Also Read : డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ లీక్.. గిల్ తండ్రిపై ఆరోపణలు

అలాగే వ్యాక్సిన్ లు వేయించుకునే సమయంలో కూడా చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం లేదని, కొత్త సూది అయితేనే వేయించుకోవాలని హెచ్చరించారు. ఏదైనా గాయాల బారిన పడిన సమయంలో కుట్లు వేయించుకునే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్లూటాతియోన్ థెరపీని అందించే స్పాలలో కూడా, సూదుల పునర్వినియోగం, పరిశుభ్రత లేకపోవడం ఈ వ్యాధి విస్తరించడానికి కారణాలు. సెలూన్ లో కూడా జాగ్రత్తగా లేకపోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, వినియోగించే బ్లేడ్ లు కత్తెరలు వంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హెపటైటిస్ బి వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని వోరా తెలిపారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్