ఐపిఎల్ అనగానే బ్యాట్స్మెన్ కు పండుగే. దానికి తోడు మైదానాలు కూడా అలాగే అనుకూలంగా ఉన్నాయి. ఫ్లాట్ పిచ్ లతో వందల పరుగులు సాధిస్తున్నాయి ఐపిఎల్ జట్లు. ఇక బౌలర్ల కంటే బ్యాట్స్మెన్ లు ఎక్కువగా స్టార్ లు అయిపోతున్నారు. ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడిన.. సౌత్ ఆఫ్రికా పేసర్ కగిసో రబాడా విషయంలో.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కక్ష సాధిస్తోంది. పిచ్‌లు మరీ ఫ్లాట్‌గా ఉన్నాయని.. ఇది క్రికెట్ కాదు, బ్యాటర్ల గేమ్‌గా అనిపిస్తోందని కామెంట్స్ చేసాడు రబాడా.
Also Read : జగన్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!
బ్యాట్-బాల్‌కు మధ్య బ్యాలెన్స్ లేనప్పుడు గేమ్ ఇలాగే ఉంటుందన్నాడు. ఇలాగేనా మ్యాచులు నిర్వహించేది అంటూ ఇన్‌డైరెక్ట్‌గా ఐపీఎల్ నిర్వాహకులు, బీసీసీఐపై అసహనం వ్యక్తం చేసాడు. ఇక అక్కడి నుంచి పిచ్ లు కాస్త మారినట్టుగానే కనపడుతున్నాయి. హైదరాబాద్ లాంటి జట్టు కూడా భారీగా పరుగులు చేయలేకపోతోంది. భారీగా పరుగులు చేసే ఆటగాళ్ళు కూడా తడబడుతున్నారు. అయితే తాజాగా ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్ లో రబాడాను గుజరాత్ టీం పక్కన పెట్టింది. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Also Read : భారత్ పాక్ సరిహద్దుల్లో మళ్ళీ అలజడి
రబాడను టీమ్‌లోకి తీసుకోవద్దని జీటీ మేనేజ్‌మెంట్‌కు బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లినట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుజరాత్ కెప్టెన్ గిల్ చెప్పిన రీజన్ కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల రబాడను ఆడించడం లేదని చెప్పుకొచ్చాడు. గిల్ కామెంట్స్ పై ఇప్పుడు అనేక అనుమానాలు వస్తున్నాయి. అతను ఫిట్ గా ఉన్నప్పుడు, టోర్నీలో ఆడాలని దేశానికి వచ్చినప్పుడు వ్యక్తిగత కారణాలు ఎందుకు ఉంటాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రశ్నించకుండా బానిసల్లా ఆడాలా అంటూ మండిపడుతున్నారు.