Friday, October 24, 2025 09:43 PM
Friday, October 24, 2025 09:43 PM
roots

ఆస్ట్రేలియా వెళ్ళండి.. సీనియర్లకు బోర్డు ఆర్డర్

గత ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు విఫలం కావడంతో రాబోయే వన్డే సిరీస్ లో బోర్డు పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన అనగానే ఉండే క్రేజ్ వేరే లెవల్లో ఉంటుంది. అయితే ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం గత పర్యటనలో అంత గొప్పగా లేదు. పదేళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత జట్టు కోల్పోయింది. ఆ తర్వాత జట్టులో కూడా కీలక మార్పుల దిశగా అడుగులు పడ్డాయి. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడానికి.. గత ఆస్ట్రేలియా పర్యటనే కారణం.

Also Read : ఎమ్మెల్యే పెత్తనం.. కార్యకర్త నరకం.!

ఇప్పుడు వన్డే సిరీస్ విషయంలో బోర్డు పెద్దలు మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈసారి సీనియర్ ఆటగాళ్లను ముందుగానే ఆస్ట్రేలియా పంపించాలని బోర్డ్ భావిస్తుంది. ఇటీవల ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ఆసియా కప్ లో లేని ఆటగాళ్లకు కూడా.. ఫిట్నెస్ పరీక్షలను నిర్వహించింది బోర్డు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఈ పరీక్షల్లో దాదాపుగా సీనియర్ ఆటగాళ్లందరూ పాసైనట్లు వార్తలు వచ్చాయి. వారిలో కొంతమంది ఆటగాళ్లు ముందుగానే ఆస్ట్రేలియా వెళ్లిపోవాలని.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలని సూచించినట్లు సమాచారం.

Also Read : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ – లాభాలు మరియు నష్టాలు

కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, జైస్వాల్ సహా పలువురు కీలక ఆటగాళ్ళను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిపోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల చివరలో జట్టు ఎంపిక ఉంది. అక్కడి పరిస్థితులకు.. త్వరగా అలవాటు పడాలని, ప్రాక్టీస్ అక్కడే చేయాలను కూడా సమాచారం. శ్రేయస్ అయ్యర్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. రిషబ్ పంత్ ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళిపోయినట్లు సమాచారం. గాయం నుంచి దాదాపుగా కోరుకున్న పంత్ గత ఆదివారం.. సిడ్ని వెళ్లినట్టు భారత క్రికెట్ వర్గాలు తెలిపాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

తెలుగు రాష్ట్రాలకు ముంచుకొస్తున్న...

భారత వాతావరణ శాఖ (IMD) తాజా...

దారితప్పిన వారిపై వేటు...

https://www.youtube.com/watch?v=O6ejiO-k3W8

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

పోల్స్