2024-25లో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు దారుణ ఓటమి నేపధ్యంలో కీలక మార్పులకు బోర్డు శ్రీకారం చుడుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టు సహాయక సిబ్బందిలో మార్పులు చేసేందుకు సిద్దమవుతోంది. ఎనిమిది నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది బోర్డు. అతనితో పాటు, ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను కూడా తొలగించారు.
Also Read : లిక్కర్ స్కాంలో కీలక పరిణామం
ఈ మార్పులో భాగంగా జట్టు మసాజర్‌ను కూడా తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన అనంతరం గౌతమ్ గంభీర్ భారత ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. కోచింగ్ సిబ్బందిలో మొత్తం తనతో పాటు పని చేసిన ఐపిఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ నుండి నాయర్, ర్యాన్ టెన్ దేశ్కాటే, మోర్నే మోర్కెల్‌లను సహాయ సిబ్బందిగా తెచ్చుకున్నాడు. వీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు ప్రదర్శన రోజు రోజుకు దారుణంగా మారడంతో మార్పులకు శ్రీకారం చుట్టింది బోర్డు.
Also Read : మళ్ళీ సాయి రెడ్డేనా..? రాజ్యసభ ఉప ఎన్నిక సందడి షురూ
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సీరీస్ వైట్ వాష్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో భారత్ జట్టు వైఫల్యాల తర్వాత.. తీవ్ర విమర్శలు వచ్చాయి. అటు కోచ్ పై కూడా తీవ్ర విమర్శలు రావడంతో అతను రాజీనామా చేసే అవకాశం ఉందని భావించారు. ఇక ఆటగాళ్లకు కోచ్ కు మధ్య సఖ్యత లేదనే విమర్శలు సైతం వచ్చాయి. ఆస్ట్రేలియాలో ఇది స్పష్టంగా కనపడింది. ఇక సీనియర్ ఆటగాళ్ళు అవసరమైన సమయంలో కూడా పక్కన పెట్టడం చికాకు పెట్టింది. త్వరలో ఇంగ్లాండ్ పర్యటన ఉన్న నేపధ్యంలో మరిన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది.