Friday, September 12, 2025 11:19 PM
Friday, September 12, 2025 11:19 PM
roots

రాహుల్ కు బోర్డు బంపర్ ఆఫర్..?

టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కెరీర్ మరో లెవల్ కు వెళ్లనుందా..? అంటే అవుననే సమాధానాలు వినపడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల క్రితం అడుగుపెట్టిన కేఎల్ రాహుల్ ఇప్పుడు దుమ్ము రేపుతున్నాడు. ఇటు ఫ్రాంచైజీ క్రికెట్ లో కూడా తాను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్లో పర్ఫెక్ట్ ఆటగాడిగా కె.ఎల్ రాహుల్ కు మంచి పేరు ఉంది. ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఆటతీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Also Read : హైదరాబాద్ నిలుస్తుందా.. ఆ ఇద్దరిపైనే వదిలేస్తుందా..?

ఆస్ట్రేలియా మైదానాలపై అతని ఆట తీరు చూసిన విమర్శకులు కేఎల్ రాహుల్ సామాన్యుడు కాదంటూ కొనియాడారు. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో కేల్ రాహుల్ ఏ స్థాయిలో రాణిస్తాడు అనేది ఇప్పుడు చాలామందిలో ఉన్న ప్రశ్న. భారత్ లో కంటే విదేశాల్లో కేఎల్ రాహుల్ కు మంచి రికార్డులు ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా దేశాల్లో సెంచరీ చేసిన ఏకైక భారత క్రికెటర్ అతనొక్కడే. దానికి తోడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలిగే సత్తా కేఎల్ రాహుల్ సొంతం. ఇక ఇంగ్లాండ్ సిరీస్ లో అతను ఓపెనర్ గా వస్తాడా లేదంటే మిడిల్ ఆర్డర్లో కంటిన్యూ అవుతాడా అనేది తెలియని పరిస్థితి.

Also Read : హమ్మయ్య రోహిత్ వచ్చేసాడు.. ఇంగ్లాండ్ టూర్ ముందు గుడ్ సిగ్నల్

అయితే ఇప్పుడు అతనికి బోర్డు మంచి ఆఫర్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కెరీర్ లో పిక్ దశలో ఉన్న కేఎల్ రాహుల్ కచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్లో కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నారు. భవిష్యత్తు కెప్టెన్ పై దృష్టిపెట్టిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పుడు కేఎల్ రాహుల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. కేఎల్ రాహుల్ ఆట తీరుపై గతంలో కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. ఇంగ్లాండులో వన్డేల తో పాటుగా టెస్టుల్లో కూడా సెంచరీలు చేశాడు రాహుల్. అతన్ని కెప్టెన్ చేస్తే అది భారత జట్టుకు కలిసొస్తుందని విమర్శకులు కూడా భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్