Friday, September 12, 2025 10:34 PM
Friday, September 12, 2025 10:34 PM
roots

ఆ తప్పంతా జగన్ దే.. బాలినేని సంచలన ఆరోపణలు

ఏపీలో అదాని వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అమెరికా కోర్ట్ లో అదానీ పై కేసు నమోదు కావడం, ఆ తర్వాత దేశంలో రాజకీయ ప్రకంపనలు మొదలుకావడం… దాని మూలాలు ఏపీలో ఉండటంతో.. గత జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ ఒప్పందాల్లో మాజీ విద్యుత్ శాఖా మంత్రి బాలినేని పాత్ర ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలపై తాజాగా మీడియా సమావేశం నిర్వహించి బాలినేని క్లారిటీ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక చోటా నాయకుడు అంటూ ఎద్దేవా చేసిన బాలినేని… జగన్ కాళ్ళు పట్టుకున్న వ్యక్తి చెవిరెడ్డి అంటూ మండిపడ్డారు.

Also Read: రాంగోపాల్ వర్మ అరెస్ట్ కి సర్వం సిద్దం

ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి కాకుండా చెవిరెడ్డికి ఎంపీ సీట్ ఎందుకు ఇచ్చారు అని ప్రశ్నించారు. కేవలం చెవిరెడ్డి మాదిరి మాగుంట శ్రీనివాసుల రెడ్డి భజన చేయలేదనే ఆయనకు సీట్ ఇవ్వలేదన్నారు. ఎక్కడో చిత్తూరు నుంచి చెవిరెడ్డి ని తెచ్చి మరీ సీట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి… చెవిరెడ్డి నన్ను కామెంట్ చేసేంతటి వాడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నేను జగన్ పార్టీ పెట్టినప్పుడు నేను మంత్రి పదవి వదిలి వచ్చి పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి అమెరికా వెళ్లి ఏమి చేస్తున్నాడో నేను గుట్టు విప్పితే పరువు పోతుందని సంచలన వ్యాఖ్యలు చేసారు.

Also Read: వీరు పార్టీ మారడం వెనుక ఇంత స్వార్ధం ఉందా?

విద్యుత్ ఒప్పందాలపై నేను సంతకం పెట్టలేదు.. కేవలం కేబినెట్ కి మాత్రమే పంపానన్నారు. అదాని ఒప్పందం కేబినెట్ తీసుకున్న నిర్ణయమన్న ఆయన… నేను ఒక్క రూపాయి కూడా ముడుపులు తీసుకోలేదని పేర్కొన్నారు. చెవిరెడ్డికి దమ్ముంటే పబ్లిక్ చర్చకు రమ్మని చెప్పండని ఛాలెంజ్ చేసారు. ఆదానితో ఒప్పందానికి నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అప్పటి సెక్రటరీ నాగులపల్లి శ్రీకాంత్ చెబితే ఆయన మీద నమ్మకంతో కేబినెట్ కి ఫైల్ పంపమని చెప్పానని… తన డిజిటల్ సైన్ ఇంకోసారి వాళ్ళు ఏదైనా చేస్తారేమోనని అనుమానంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. మొత్తం మీద ఆదానీతో విద్యుత్ ఒప్పందాల విషయంలో తన పాత్ర ఏమీ లేదని.. తప్పంతా జగన్ దే అంటూ సంచలన ఆరోపణలు చేయడం ఏపీ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్