Friday, September 12, 2025 03:18 PM
Friday, September 12, 2025 03:18 PM
roots

వైసీపీకి చావు దెబ్బ.. బాలినేని రివేంజ్ మోడ్..?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసిపి ఖాళీ అయిపోతుందా…? అంటే.. అవుననే సమాధానం వినపడుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ గతంలో చాలా బలంగా ఉండేది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా ప్రకాశం జిల్లాపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. జిల్లాలో బలమైన నాయకత్వం ఉండటంతో తెలుగుదేశం పార్టీ 2019లో కూడా నాలుగు స్థానాలు గెలిచింది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో ప్రభావం చూపించింది. ఇక వైసిపి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు కంప్లీట్ గా బలహీనంగా కనపడుతుంది.

Also Read : పార్టీ నేతలకే నమ్మకం పోయింది..!

దీనికి కారణం ఆ పార్టీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు రావడమే. ఆయన బయటకు వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల్లో కూడా పార్టీపై పెద్దగా ఆసక్తి కనపడలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి వర్గమే ఉంది. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా బాలినేని వైసీపీ నుంచి బయటకు వచ్చారు. ఇక ఇప్పుడు వైసీపీని గట్టి దెబ్బ కొట్టేందుకు బాలినేని రెడీ అవుతున్నట్లు సమాచారం. తనను అవమానించిన ఆ పార్టీని ఎలాగైనా సరే ప్రకాశం జిల్లాలో ఖాళీ చేయాలని బాలినేని పట్టుదలగా ఉన్నారు.

Also Read : పింఛన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..!

ఇందుకే ఒంగోలు పార్లమెంటు పరిధిలోని పలువురు కీలక నేతలను ఆయన జనసేన పార్టీలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. పార్టీ పదవులు గురించి ఆలోచించకుండా పార్టీ మారాలని నేతలకు బాలినేని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వద్ద అనుమతి తీసుకున్న బాలినేని త్వరలోనే నలుగురు మాజీ ఎమ్మెల్యేలను వైసీపీలో జాయిన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ఓ మాజీ మంత్రిని కూడా జనసేనలోకి తీసుకువచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న సదరు మాజీ మంత్రిని ఎలాగైనా సరే జనసేనలోకి తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలపైనే బాలినేని ఎక్కువగా ఫోకస్ పెట్టారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్