అఖండ సీక్వెల్ కు పాజిటివ్ టాక్ రావడంతో నరసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో తదుపరి సినిమాలపై బాలయ్య ఫోకస్ పెట్టారు. యంగ్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ డైరెక్షన్లో బాలయ్య ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా స్టోరీ బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కి నచ్చడంతో సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు బాలయ్య కూడా ఓకే చెప్పారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి సినిమా విషయంలో కొంత సస్పెన్స్ నడుస్తోంది.
Also Read : వాళ్లు చట్టానికి అతీతులా.. విచారిస్తే తప్పేంటి..?
ఇక లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. బాలయ్య చెప్పిన కొన్ని మార్పులకు గోపీచంద్ ఓకే చెప్పడంతో సినిమా ముందుకు వెళ్తోంది. చిన్నచిన్న మార్పులతో ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం ఫైనల్ చేశారు. దసరా నాటికి సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో సినిమా యూనిట్ ఉన్నట్లు టాక్ నడుస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కాకుండా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీసుకురావాలని డైరెక్టర్ ప్లాన్ చేశాడు. కంప్లీటుగా తెలంగాణ పాలిటిక్స్ ను బేస్ చేసుకుని ఈ సినిమాను డిజైన్ చేసినట్లు సమాచారం.
Also Read : మా జీవితాలు నాశనం.. బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
ఈ సినిమాలో బాలయ్య పవర్ఫుల్ పొలిటిషన్ గా.. బిజినెస్ మెన్ గా కూడా కనిపించనున్నారు. ఇక సినిమాలో నెగిటివ్ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేయాలా అనే దానిపై కసరత్తు చేస్తుంది యూనిట్. ఇప్పటికే ముగ్గురు పేర్లను ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బాబి డియోల్ పేరును ముందు పరిశీలిస్తుంది యూనిట్. అలాగే తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీర సింహారెడ్డి సినిమా స్టైల్ లోనే ఏ సినిమాలో కూడా బాలయ్య ఆల్మోస్ట్ కనబడతారని టాక్. ఓ మైన్స్ ఓనర్ పాలిటిక్స్ లోకి ఎలా వచ్చే సక్సెస్ అయ్యారు అనేదానిపై సినిమాను డిజైన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

