మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత గడ్డుకాలం నడుస్తోంది. తాడు పట్టుకున్నా సరే పామై కరుస్తోంది అనే సామెత ప్రస్తుతం జగన్ కు సరిగ్గా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే చిన్న దారం కూడా పెద్ద కొండచిలువ మాదిరిగా మారింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. ప్రతిపక్షం అవసరమా అంటూ వై నాట్ 175 అనే స్లోగన్ తో ఎన్నికల్లో పోటీ చేసి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అయితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లుగా జగన్ ఓటమికి కూడా స్వీయతప్పిదాలే కారణం.
Also Read: సంచలన నిర్ణయం దిశగా లోకేష్
అధికారంలో ఉన్నప్పుడు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ లేదు. జిల్లాల్లో పర్యటించినప్పుడు పరదాలు కట్టుకున్నారు. చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సొంత చెల్లెలు షర్మిల కూడా జగన్ కు ఎదురు తిరిగారు. వీటన్నిటికీ తోడు అవినీతి ఆరోపణలు. అయితే ప్రధానంగా కుటుంబ తగాదాలే జగన్ పై జనంలో వ్యతిరేకతకు కారణం అనే మాట వినిపిస్తుంది. ఆస్తిలో వాటా విషయంలో షర్మిలకు జగన్ కు మధ్య విబేధాలు వచ్చాయని… వాటా ఇవ్వకుండా జగన్ మోసం చేయడంతో షర్మిల సొంత పార్టీ పెట్టుకున్నారనే మాట ప్రజల్లోకి బాగా వెళ్లింది.
Also Read: చెల్లితో రాజీ లేదు.. షర్మిల చీటర్
అందుకే జగన్ కు వ్యతిరేకంగా ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిల చేపట్టారు కూడా. ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా షర్మిల ప్రచారం చేశారు. అయితే తాజాగా అన్నాచెల్లెళ్ల మధ్య ఆర్ధిక లావాదేవీల విషయం బయటకు వచ్చింది. ఆస్తిలో వాటా ఇచ్చేది లేదని జగన్ లేఖ రాయడం… దానికి కౌంటర్ గా షర్మిల కూడా రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిల రాసిన లేఖపైన తల్లి వైఎస్ విజయలక్ష్మి కూడా సంతకం చేయడం జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ. ఓవైపు పార్టీ ఓటమి, కీలక నేతల రాజీనామా, మాజీల చుట్టూ కేసులు… వీటన్నిటికీ తోడు సొంత తల్లి, చెల్లి కూడా వ్యతిరేకించడంతో… జగన్ కు బ్యాండ్ బాజా బారాత్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.