ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒక లెక్క.. అని మిర్చి సినిమాలో డైలాగును చంద్రబాబు అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఇప్పటి వరకు ప్రత్యర్థులపై ఎలాంటి రాజకీయాలు చేయలేదు చంద్రబాబు. అలాగే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినప్పటికీ.. కేవలం అభివృద్ధి మంత్రం మాత్రమే జపించారు. అంతే తప్ప.. పార్టీ కోసం, కార్యకర్తల గురించి పెద్దగా ఆలోచించింది లేదు. అలాగే ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు కూడా ఎలాంచి ప్లాన్ వేయలేదు. దీంతో 9 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 అన్నారు. ఆ తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నవ్యాంధ్య అంటూ ప్లాన్ చేశారు. అందుకే ఇప్పటికే 15 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు.
Also Read: చంద్రబాబుకు, జగన్‌కు అదే తేడా..!
అయితే ఇప్పుడు మాత్రం చంద్రబాబు ఆలోచనా విధానం మారినట్లుగా కనిపిస్తోంది. దెబ్బ కొడితే ప్రత్యర్థి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అన్నట్లుగా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైన చంద్రబాబు ఫోకస్ పెట్టలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే లైట్ తీసుకున్నారు కూడా. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వైఎస్ జగన్ గురించి ఏపీ ప్రజలకు పూర్తిగా క్లారిటీ వచ్చింది. అప్పటి వరకు రాజన్న రాజ్యం అంటూ పాదయాత్ర చేసిన జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత నుంచి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశాడనేది వాస్తవం. ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు, ఆస్తుల విధ్వంసం, వ్యక్తిగత దూషణ, వ్యక్తిత్వ హననం… ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి.
Also Read: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకి రంగం సిద్దం..!
అదే సమయంలో డబ్బే లక్ష్యం అన్నట్లుగా మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. దీంతో ఏపీ ప్రజలు కూడా ఇలాంటి విధ్వంసకర పాలనకు చరమగీతం పాడారు. తనదాకా వస్తే తప్ప నొప్పి ఎలా ఉంటుందో తెలియదన్న సామెత మాదిరిగా.. అక్రమ కేసులో అరెస్టు అయిన తర్వాతే జగన్ వైఖరి ఏమిటో చంద్రబాబుకు బోధపడినట్లుంది. అందుకే ఈసారి దెబ్బకొడితే మామూలుగా ఉండకూడదన్నట్లుగా చంద్రబాబు రాజకీయ పావులు కదుపుతున్నారు. 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. జగన్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా అడ్డుకోగలిగాయి. అయితే గెలిచిన తర్వాత కూడా వైసీపీని లైట్‌గా తీసుకోలేదు. వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ముందుగా వైసీపీలో ముఖ్యనేతలంతా జగన్‌కు దూరమయ్యేలా చేస్తున్నారు. అలాగే నాడు జగన్‌కు భజన చేసి.. ప్రత్యర్థులపై దాడులకు తెగబడిన వారి భరతం పడుతోంది ప్రభుత్వం.
Also Read: కడపలో వైసీపీకి షాక్ తప్పదా..?
జగన్ నిజస్వరూపం బయటపడటంతో.. విజయసాయిరెడ్డి వంటి అత్యంత సన్నిహితులు కూడా దూరంగా పారిపోతున్నారు. ఇప్పుడు జగన్ కంచుకోటలో పాగా వేసేందుకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ కేవలం 3 చోట్ల మాత్రమే గెలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచారు. ఇక జగన్ మెజారిటీ కూడా 90 వేల నుంచి 60 వేలకు తగ్గించారు. ఈ నేపథ్యంలోనే మే నెలలో మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు మరో మాస్టర్ ప్లాన్ వేశారు. పులివెందులలో మహానాడు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. దీని వల్ల టీడీపీ బలం ఏమిటో పులివెందుల ప్రజలకు తెలుస్తుందని.. అలాగే వైఎస్ కుటుంబం పట్ల ఉన్న భయం కూడా పోతుందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దీని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్పష్టంగా ఉంటుందనేది చంద్రబాబు ప్లాన్. టీడీపీ అధినేత వేసిన ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం.. జగన్ కోటకు బీటలు తప్పవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.