Friday, September 12, 2025 11:23 PM
Friday, September 12, 2025 11:23 PM
roots

ఎవరికి భయపడ్డారు..? ‘సీ పోర్ట్’ వాటాలు గుట్టుగా వెనక్కి..!

కాకినాడ పోర్ట్ వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సి పోర్ట్ డీల్ రివర్స్ అయింది. వాటాలను అరబిందో కంపెనీ తిరిగి కె.వి. రావుకు అప్పగించింది. మూడు రోజుల క్రితం బదిలీ కార్యక్రమాన్ని అత్యంత గుట్టుగా నిర్వహించారు. వైసిపి హయాంలో తనను బెదిరించి భయపెట్టి వాటాలను లాగేసుకున్నారని గత నెలలో కేవీ రావు సిఐడి కి ఫిర్యాదు చేశారు. సిఐడి ఫిర్యాదు ఆధారంగా 494 కోట్ల చెల్లింపులపై ఈడి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇప్పటికే వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి విక్రాంత్ రెడ్డిలను ఈడి అధికారులు విచారించారు.

Also Read : వైసీపీ నేతలకు షెల్టర్ జోన్ గా బిజేపి, జనసేన

ఒకవైపు ఈ డి విచారణ జరుగుతుండగానే కె.వి.రావుకు గతంలో గుంజుకున్న వాటాలను అరబిందో సంస్థ తిరిగి అప్పగించడానికి రెడీ అయిపోయింది. ఈ వివాదంలో పైస్థాయి వ్యక్తులు మధ్యవర్తిత్వం జరపడంతో వాటాలను తిరిగి అప్పగించేశారు. అయితే సెజ్ ను మరిచిపోవాలని కేవీరావుకు షరతు విధించారు మధ్యవర్తులు. ఈడీ అధికారులు రంగంలోకి దిగటంతో అరవింద సంస్థలో కంగారు మొదలైంది. కాకినాడ పోర్ట్ లో మనీ లాండరింగ్ పై ఈడీ అధికారులు ఆరా తీయడం, అరబిందో ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి తలెత్తడంతో తీగలాగితే భారీగా డొంక కదిలే అవకాశాలు ఉన్నాయని అరబిందో సంస్థ అలెర్ట్ అయింది.

Also Read : పవన్ జోక్యం చేసుకున్నా.. రాని కుంకీ ఏనుగులు…!

ప్రస్తుత పరిస్థితులను కెవి రావు కూడా పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీనితో పై స్థాయి వ్యక్తులు రంగంలోకి దిగి ఇద్దరిని కూర్చోబెట్టి కొత్త డీల్ కు ఓకే చెప్పించారు. రూ.2500 కోట్ల విలువైన 2.15 కోట్ల షేర్లను జగన్ గ్యాంగ్ 494 కోట్లకే లాగేసుకున్నట్టు కెవి రావు ఆరోపణలు చేశారు. ఇక తాజా డీల్ లో ఎనిమిది వేల ఎకరాలు ఉన్న కాకినాడ పూర్తిగా అరబిందోకు సొంతమైంది. కాకినాడ సెజ్ గురించి మర్చిపోండి.. అది అరబిందోకే, పోర్ట్ లో మీ నుంచి తీసుకున్న వాటాలు మీకే వచ్చేస్తాయని డీల్ కుదిరించారు పెద్దలు.

Also Read : ఏపిలో భారీగా ఐపిఎస్ అధికారుల బదిలీలు

మూడు రోజుల క్రితం అత్యంత గుట్టుగా ఈ వ్యవహారాన్ని ముగించారు. కాకినాడ సెజ్ లో తన వాటాగా 1104 కోట్లు రావాల్సి ఉండగా 12 కోట్లతో సరిపెట్టారని కెవి రావు సిఐడి కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోర్టు వాటాలను తిరిగి ఇచ్చేసినందున ఇక సెజ్ గురించి మర్చిపోయే విధంగా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్