Friday, September 12, 2025 03:27 PM
Friday, September 12, 2025 03:27 PM
roots

అచ్చెన్న.. ఏమిటీ నోటి దూల..!

శత్రువులు ఎక్కడో లేరు రా.. అనే రావు రమేశ్ చెప్పిన డైలాగ్ మంత్రి అచ్చెన్నాయుడుకు సరిగ్గా సరిపోతుంది. కూటమి ప్రభుత్వానికి వైసీపీ నేతలకంటే అచ్చెన్న చేసే కామెంట్ల నుంచే ఎక్కువ తలనొప్పులు వస్తున్నాయి. టెక్కలి నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తున్న కింజరాపు అచ్చెన్నాయుడు ప్రస్తుతం తెలుగుదేశం కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఐదేళ్ల పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆ సమయంలో కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక పార్టీ గెలిచిన తర్వాత కూడా అచ్చెన్న తీరు ఇప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. సూపర్ సిక్స్ హామీలపై వరుసగా అచ్చెన్న చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ అధినేత పైనే విమర్శలు తెప్పిస్తున్నాయి.

Also Read : సింగపూర్ లో చంద్రబాబు.. టార్గెట్ ఇదే

2024 ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీల పేరుతో ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో 6 పథకాలను ప్రకటించారు. అందులో మొదటిది యువతకు ఐదేళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. అందుకోసం ఇప్పటికే ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటోంది. రెండోది తల్లికి వందనం… బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దానిని ఈ ఏడాది జూన్ 12న అమలు చేశారు కూడా. ఇక మూడోది అన్నదాత సుఖీభవ.. ఈ పథకం అమలుకు ఆగస్టు 2న ముహుర్తం పెట్టారు. నాలుగో హామీ కింద ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీపం – 2 పధకం కింద అమలు చేస్తున్నారు. 5వ హామీ కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందన్నారు చంద్రబాబు. ఇక ఆరో హామీ కింద ప్రతి మహిళకు నెలకు 15 వందల రూపాయలు ఇస్తామన్నారు. ఆ పథకాన్ని పీ4 కు లింక్ చేసినట్లు ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు కూడా. సామాజిక పింఛన్ల పెంపు సహా ఎన్నో హామీలు అమలు చేశామనేది కూటమి సర్కార్ మాట.

Also Read : ఎవరి మీద నమ్మకం లేదంటున్న వైసీపీ..!

అయితే ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి సర్కార్ పాలన ఏడాది గడిచిన సందర్భంగా తొలి అడుగు పేరుతో టీడీపీ నేతలు గడప గడపకు వెళ్తున్నారు. ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా వివరిస్తున్నారు. ఈ సభలకు సామాన్య కార్యకర్త మొదలు మంత్రులు కూడా హాజరవ్వాలనేది చంద్రబాబు ఆదేశం. దీంతో మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కూడా మంత్రి అచ్చెన్నాయుడు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సభలో సూపర్ సిక్స్ హామీల అమలు గురించి ప్రస్తావించారు. మహిళలకు నెలకు 15 వందల రూపాయలు ఇవ్వాలంటే.. రాష్ట్రాన్ని అమ్మాలి.. అది ఎలాగా అని ఆలోచిస్తున్నాం.. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించాయి. రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మకానికి పెట్టారని… చేతకానీ ప్రభుత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఇక తాజాగా మరోసారి అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఏడాది పాటు కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో పర్యటించిన మంత్రుల బృందం.. పథకం అమలులో లోటు పాట్లను గుర్తించి.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం జిల్లా వరకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో అమలు చేయాలా.. లేక కొత్త జిల్లా పరిధి వరకేనా అనే విషయంపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. ఇలాంటి అచ్చెన్న పెద్ద బాంబు పేల్చారు.

Also Read : బీసిసిఐ సంచలన నిర్ణయం.. వాళ్లకు గుడ్ బై..!

రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. దీంతో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పడాన్నే వైసీపీ నేతలు పెద్ద ఎత్తున తప్పుబడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికైన అనే హామీ ఇచ్చారని.. ఇప్పుడు జిల్లా వరకే పరిమితమని మాటా మార్చారని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అచ్చెన్నాయుడు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని చెప్పడంతో కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఆగస్టు 15 నుంచి పధకం అమలు చేయాల్సి ఉండది. దీనిపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. చంద్రబాబు సింగపూర్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే పథకంపై అమలుపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఇంతలోనే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించడాన్ని కూటమి నేతలు తీవ్రంగా తప్పుబతున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందంటున్నాు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్