Saturday, October 25, 2025 08:04 PM
Saturday, October 25, 2025 08:04 PM
roots

జూనియర్ సెహ్వాగ్ అదిరిపోయే బ్యాటింగ్

ఒకప్పుడు క్రికెట్ లో వీరేంద్ర సెహ్వాగ్ అనగానే అతని డాషింగ్ బ్యాటింగ్ గుర్తుకు వచ్చేది. బౌలర్ ఎవరైనా సరే దూకుడుగా ఆడే సెహ్వాగ్.. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చాడు. ఇప్పుడు అతని కొడుకు కూడా అదే బాటలో పయనిస్తూ తండ్రిని గుర్తు చేస్తున్నాడు. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. తన తండ్రి మాదిరిగానే భారీ షాట్ లతో విరుచుకుపడుతున్నాడు. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో.. దుమ్ము రేపాడు ఆర్యవీర్ సెహ్వాగ్.

Also Read : రెండు పెన్షన్లు.. చిరంజీవిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్

తన తండ్రిలాగే ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆర్యవీర్ క్రీజ్ లో సెటిల్ అయిన తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేసాడు. దులీప్ ట్రోఫీ కోసం యష్ ధుల్ జట్టు నుంచి బయటకు వెళ్ళగా అతని స్థానంలో ఆర్యవీర్ జట్టులోకి వచ్చాడు. క్లిష్ట సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ఆర్యవీర్.. 16 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేసినా.. దూకుడుగా బ్యాటింగ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో అతనిని 8 లక్షలకు ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ కొనుగోలు చేసింది. అటు దేశవాళి మ్యాచుల్లో కూడా అతను దూకుడుగా ఆడుతున్నాడు.

Also Read : ట్రంప్ దెబ్బకు తమిళనాడులో ఆ నగరం ఖాళీ..!

వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ తరపున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్ లో 49 పరుగులు చేసాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో మేఘాలయపై 229 బంతుల్లో 34 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 200 పరుగులు చేసి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత రోజే అతను మరో 97 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 309 బంతుల్లో 297 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 51 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతని దూకుడు చూస్తున్న క్రికెట్ అభిమానులు.. త్వరలోనే జాతీయ జట్టులో అడుగు పెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్