తెలంగాణా అధికార కాంగ్రెస్ లో విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడిని రేవంత్ కలవడం… రేవంత్ కు రాహుల్ గాంధీ అపాయింట్మెంటు ఇవ్వకపోవడం సంచలనం అయింది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన రాజకీయాలు మాట్లాడుతున్నారు అని అర్వింద్ విమర్శించారు.. నవోదయ విద్యాలయాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రెండు వచ్చాయన్నారు.
Also Read : రజనీ కేసులపై ఏసీబీ కీలక నిర్ణయం…!
ఒకటి జగిత్యాల జిల్లా ఇంకోటి నిజామాబాద్ జిల్లా కు మంజూరు అయ్యాయని… నిజామాబాద్ లో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నందున జిల్లాలోని జక్రాన్ పల్లి వద్ద ప్రపోజల్ పెట్టామన్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వల్ల అక్కడ ల్యాండ్ ప్రపోజల్ రిజెక్ట్ అయిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పనికి మాలిన పనుల వల్ల మంచి ప్రాజెక్టులు ఆలస్యమయ్యాయని… నిజాం షుగర్ ఫ్యాక్టరీ స్థలం ఇస్తామని సుదర్శన్ రెడ్డి ప్రపోజల్ పెట్టాడన్నారు. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవరా..? అని నిలదీశారు రేవంత్.
Also Read : నటరాజన్ టీమ్ రెడీ.. టీపీసీసీలో పదవులు ఎవరికంటే..?
రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన అర్వింద్.. మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని స్పష్టం చేశారు. రేవంత్ బిజెపిలోకి వస్తా అంటే ఆహ్వానిస్తామన్నారు అర్వింద్. రాహుల్ గాంధీ గ్రహాంతర వాసి అని ఎద్దేవా చేసారు. ఒకవేళ ఆయన రేవంత్ ను తీసేస్తే రేవంత్ ఖాళీగా ఉండడు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు పార్టీలోకి వస్తా అంటే నేను ఆహ్వానిస్తాను అన్నారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణా రాజకీయాల్లో సంచలనంగా మారాయి. రేవంత్ రెడ్డి గత కొన్నాళ్ళుగా కాంగ్రెస్ నేతలతో కంటే బీజేపీ నేతలతో సావాసం చేస్తున్న సంగతి తెలిసిందే.




