Tuesday, October 28, 2025 07:27 AM
Tuesday, October 28, 2025 07:27 AM
roots

ఆ రెండు పదవులిస్తే ఉంటా.. లేదంటే అంతే..!

2024 ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతోంది. పార్టీలో కీలక నేతలంతా ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. జగన్ అత్యంత సన్నిహితులు, అక్రమాస్తుల కేసులో సహ నిందితులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ వంటి నేతలు కూడా నీకో నమస్కారం అని చెప్పేసి పార్టీ నుంచి దూరంగా వెళ్లిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నేత కూడా కరువయ్యాడు. దీంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ప్రతి నెలా ఒక జిల్లాలో ఏదో ఒక వంకతో పర్యటిస్తూ వైసీపీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ పరువును మరింత దిగజారుస్తున్నాయి. దీంతో వైసీపీలోనే ఉంటే తమ పరువు కూడా పోతుందని పార్టీలో పలువురు సీనియర్ నేతలు మదన పడుతున్నారు.

Also Read : ఫాం హౌస్ లో జగన్ తో కేటిఆర్ భేటీ

మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ సహా పలువురు సీనియర్ నేతలు కనీసం బయటకు మాట్లాడేందుకు కూడా సుముఖత చూపటం లేదు. నరుకుతాం, చంపుతాం అని కార్యకర్తలు అంటుంటే.. అంటే తప్పేంటి అని పార్టీ అధినేత స్వయంగా వారిని వెనకేసుకుని రావడం పట్ల సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాలే వచ్చాయని.. అయినా అధినేతలో ఎలాంటి మార్పు రాలేదనేది ఆ పార్టీ సీనియర్ నేతల మాట. నిన్నటి వరకు అధినేత మాటే వేదం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీలో సీనియర్ నేతలు.. ఇప్పుడు ఒక్కొక్కరుగా నిరసన గళం విప్పుతున్నారు. ఇదే అదునుగా తమ మననులో మాటను బయటపెడుతున్నారు కూడా.

Also Read : జగన్ ధైర్యం కంటే సుప్రీం భయమే వైసీపీని డామినేట్ చేస్తుందా..?

వైసీపీ నేతల్లో ఇప్పటి నుంచి టికెట్ల కోసం నేతలు తమ అధినేతను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో వారసులకు టికెట్లు అడిగిన కొందరు సీనియర్లకు జగన్ నో చెప్పారు. కానీ ఇదే సమయంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని కృష్ణమూర్తి, కరణం వెంకటేష్ సహా ఒకరిద్దరికి మాత్రమే టికెట్లు ఇచ్చారు. ఇది కొందరు సీనియర్లకు మింగుడు పడలేదు. అధినేత జగన్ తీరుపై అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు ఏడాది పాటు రాజకీయాలకు, కార్యకర్తలకు దూరంగా ఉన్న కొందరు నేతలు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కొందరు నేతలు పార్టీ మారితే ఎలా ఉంటుందనే విషయంపై తమ సన్నిహితులతో చర్చిస్తున్నారు కూడా. ఇక కొందరు నేతలైతే.. అధినేతకే అల్టిమేటం జారీ చేస్తున్నారు.

Also Read : HCA రోత పనులు.. బంతుల్లో కూడా కక్కుర్తి

ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయ్యారు ఉత్తరాంధ్ర వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళం జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధర్మాన ప్రసాదరావు.. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా భావించారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు ధర్మాన రామ్ మనోహర్‌ను ఇప్పటికే యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకువచ్చారు. 2024 ఎన్నికల్లోనే రామ్ మనోహర్‌కు టికెట్ ఇవ్వాలని వైఎస్ జగన్‌ను పలుమార్లు కోరారు కూడా. కానీ జగన్ మాత్రం.. ఈసారికి మీరే అభ్యర్థి అని తేల్చి చెప్పడంతో.. చేసేది లేక సైలెంట్‌గా పోటీ చేశారు. ఎన్నికల ఓటమి తర్వాత ఏడాది పైగా నియోజకవర్గానికి, కార్యకర్తలకు దూరంగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు. కానీ ఇటీవల తన అనుచరులతో సమావేశమైన ధర్మాన.. తన మనసులో మాట బయటపెట్టారు.

Also Read : సీఎం పదవికి లిక్కర్ స్కాం శాపం.. మరో మాజీ సీఎంకు తాగుబోతుల పాపం

రాబోయే ఎన్నికల్లో తన కుమారుడికి శ్రీకాకుళం ఎమ్మల్యే టికెట్‌తో పాటు తనకు కూడా శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఇవ్వాలన్నారు. అలా ఇస్తేనే రాజకీయాల్లో ఉంటానని.. లేదంటే వైసీపీలో ఉండేది లేదని తేల్చేశారు. ఇదే విషయం పార్టీ పెద్దల ద్వారా అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు ధర్మాన తన సన్నిహితులకు స్పష్టం చేశారు. ఇంతకాలం పార్టీ చెప్పినట్లు నడుచుకున్నామని.. ఇప్పటికైనా పార్టీ తన మాట వినాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడిన 6 నెలల తర్వాత ధర్మాన ప్రసాదరావు వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ దీనిపై ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ మాత్రం.. తన తమ్ముడు వైసీపీలోనే ఉన్నారని.. ఎక్కడికి పోలేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు అల్టిమేటంతో సిక్కోలు రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్