Wednesday, April 15, 2026 10:39 AM
Wednesday, April 15, 2026 10:39 AM

పెరుగు – యోగర్ట్.. రెండూ ఒకటి కాదా..?

మనం రోజూ తినే పెరుగు, మార్కెట్లో దొరికే యోగర్ట్ చూడటానికి ఒకేలా ఉన్నా.. వాటి తయారీ విధానం మరియు అందులో ఉండే బ్యాక్టీరియా విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఆ కీలక వ్యత్యాసాలు ఇవే. పెరుగు ఇంట్లో సహజంగా తయారుచేసేది. పాలను తోడు పెట్టడానికి మునుపటి పెరుగును వాడతాము. ఇందులో లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇందులో ఉండే బ్యాక్టీరియా రకాలు, వాటి సంఖ్య మనం వాడే తోడును బట్టి మారుతూ ఉంటాయి.

Also Read : టీడీపీ నేతలపై అధిష్టానం థర్డ్ ఐ.. అడుగు తప్పితే వేటు తప్పదా..?

యోగర్ట్ పారిశ్రామికంగా, నియంత్రిత పద్ధతిలో తయారవుతుంది. ఇందులో నిర్దిష్టంగా లాక్టోబాసిల్లస్ బల్గారికస్, స్ట్రెప్టోకోకస్ థర్మోఫిలస్ అనే రెండు రకాల బ్యాక్టీరియా స్ట్రెయిన్స్‌ ను ఉపయోగిస్తారు. పెరుగు ఇంట్లో సహజంగా గది ఉష్ణోగ్రత వద్ద తయారవుతుంది. కానీ యోగర్ట్ తయారీలో పాలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి, అందులో లైవ్ కల్చర్లను కలిపి పులియబెడతారు. దీనివల్ల యోగర్ట్ ఎప్పుడూ ఒకే రకమైన రుచిని, చిక్కదనాన్ని కలిగి ఉంటుంది. యోగర్ట్‌ ను ఒక ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణిస్తారు.

Also Read : వైసీపీపై పయ్యావుల, నిమ్మల, అచ్చెన్నల త్రిశూల వ్యూహం..!

ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను నేరుగా చేరుకుని మేలు చేస్తుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా కూడా జీర్ణక్రియకు మంచిదే కానీ, అది కడుపులోని ఆమ్లాలను తట్టుకుని పేగుల వరకు ఎంతవరకు చేరుతుందనేది ఖచ్చితంగా చెప్పలేము. పెరుగు సాధారణంగా కొంచెం పుల్లగా ఉండి, కాస్త నీరుగా ఉంటుంది. యోగర్ట్ మాత్రం చాలా చిక్కగా ఉండి, వివిధ ఫ్లేవర్లలో లభిస్తుంది ఇంట్లో చేసుకునే పెరుగు సహజమైనది.. సురక్షితమైనది. అయితే నిర్దిష్టమైన ప్రోబయోటిక్ ప్రయోజనాలు కావాలనుకునే వారు యోగర్ట్‌ ను ఎంచుకోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమలలో ఆ దర్శనం...

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర...

నా భార్యకు భద్రత...

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల...

వాళ్లిద్దరు కలిశారు సరే.....

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు...

వైసీపీ రాజకీయ పార్టీనా.....

వైసీపీ నేతల వరుస ప్రకటనలు ఇప్పుడు...

బ్రేకింగ్: కేసీఆర్ కు...

తెలంగాణ పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ...

టీడీపీ నేతలపై అధిష్టానం...

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

పోల్స్