Saturday, September 13, 2025 03:17 AM
Saturday, September 13, 2025 03:17 AM
roots

ఏపీ ట్రాఫిక్ రూల్స్ చేంజ్.. ఫైన్ కట్టకపోతే సీజ్.. సీసీ కెమెరా ఫైన్లకు బ్రేక్…?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే ట్రాఫిక్ రూల్స్ మారే అవకాశం కనపడుతోంది. హైదరాబాద్ తరహా పలు రూల్స్ ను విజయవాడలో ముందు అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా విజయవాడ పోలీసుల తీరుపై ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. మోటారు వాహన చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారన్న సందేశాన్ని ప్రజలకు పంపాల్సిన అవసరముందని ఏపి హైకోర్టు పోలీసులకు సూచించింది.

Also Read :ఏపీ కేబినేట్ లో అడుగుపెడుతున్న పల్లా…!

రహదారులపై ముమ్మర తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధించాలని పోలీసులు రోడ్డుపై ఉంటే నేరం చేయడానికి సిద్ధపడ్డ వారు కూడా వెనక్కితగ్గడమో, వాయిదా వేయడమో చేస్తారని కోర్ట్ అభిప్రాయపడింది. ట్రాఫిక్ ఐజీని వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు క్రియాశీలకంగా వ్యవహరించాలనీ… పోలీసులు సీసీ కెమెరాలపై ఆధారపడి చలానాలు వేసే విధానాన్ని తగ్గించాలని హైకోర్టు సూచనలు చేసింది. సీసీ కెమెరాల్లో చూసి జరిమానా విధించడానికి ఏయే అంశాలు ప్రామాణికంగా తీసుకుంటున్నారో తెలపాలని కోర్ట్ ఆదేశించింది.

జరిమానా సొమ్మును 90 రోజుల్లో చెల్లించకుంటే వాహనాన్ని జప్తు చేయొచ్చన్న నిబంధనను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. నిర్దిష్ట సమయంలో చలానాలు చెల్లించని వారి వాహనాలను సెక్షన్-167 ప్రకారం సీజ్ చేయాలని ఆదేశించింది. సెక్షన్-206 ప్రకారం వారి లైసెన్స్ రద్దు చేయాలని… హెల్మెట్ ధరించని కారణంగా జూన్ నుంచి 3 నెలల్లో 667 మంది చనిపోవడం చిన్నవిషయం కాదని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ను తప్పనిసరి చేయాలని జూన్ లో మేమిచ్చిన ఆదేశాలు అమలుచేసి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికాదని కోర్ట్ పేర్కొంది.

Also Read :జగన్‌లో మార్పుపై.. వైసీపీ కార్యకర్త అభిప్రాయం ఏమిటో…?

99 శాతం మంది హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నారని బైక్ నడిపే వ్యక్తే కాకుండా, వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించేలా చూడాలని స్పష్టం చేసింది. విజయవాడలో వాహనదారులకు క్రమశిక్షణ లేదని ఎక్కడా నో హారన్ బోర్డులు కన్పించడం లేదని అతిగా హారన్ మోగిస్తూ ప్రజలకు నరకం చూపిస్తున్నారని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆటోల్లో పరిమితికి మించి పాఠశాల పిల్లల్ని తీసుకెళ్తున్నారని కొందరు ఇదే చివరిరోజు అన్నంత వేగంగా దూసుకుపోతురాని హై కోర్టు మండిపడింది. సరిపడా స్పీడ్ గన్లు లేవని అలాంటి వారిని పోలీసులు ఆపి తనిఖీ చేస్తున్న దాఖలాలు మేం గమనించలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించనందునే, ఉల్లంఘనలు జరుగుతున్నాయి… పోలీసులు నిబంధనలు కఠినంగా అమలు చేస్తే రెండు నెలలకు సమూల మార్పులు వస్తాయని.. దానికి తాము గ్యారెంటీ అని పేర్కొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్