ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో కీలక అడుగు పడింది. పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న ఏపీ సర్కార్.. ఇటీవల గూగుల్ ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఢిల్లీలో గూగుల్ తో ఏపీ కీలక, చారిత్రక ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరగగా.. ఈ కార్యక్రమంలో, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ పాల్గొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.
Also Read : వాట్సాప్‌లో దొరికిపోయిన జోగి
ఒప్పంద పత్రాలపై గూగుల్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల సంతకాలు చేసారు. ‘భారత్ ఏఐ శక్తి’ పేరుతో గూగుల్ కార్యక్రమం నిర్వహించగా.. పలువురు ప్రముఖులకు సైతం ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ`కేబుల్ విధానం ద్వారా అనుసంధానం చేస్తున్నామని, గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ ప్రకటించారు. అమెరికా వెలుపల పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడమిదే తొలిసారి అని తెలియజేసారు. జెమినీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయన్న ఆయన.. ఈ డేటా సెంటర్ ద్వారా ప్రపంచస్థాయి ఏఐ నిపుణులు తయారయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
Also Read : ఎమ్మెల్యే తీరుపై క్యాడర్ ఫుల్ ఫైర్..!
వచ్చే ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. భారత్‌కే కాదు.. విశాఖ నుంచి వివిధ దేశాలకు కనెక్టివిటీకి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ మాట్లాడుతూ.. సాంకేతికత ప్రపంచాన్నే మార్చేస్తోందని, సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయన్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటి కంపెనీలు రాష్ట్రానికి వస్తే, వాటిని చూసి కొన్ని వందల చిన్న పెద్దా ఐటి కంపెనీలు ఏపీకి తరలివస్తాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో దశాబ్దాలుగా ఫార్మా తదితర పరిశ్రమలు కోకొల్లలున్నాయి. కానీ ఐటి కంపెనీలు వచ్చిన తర్వాతే హైదరాబాద్ అభివృద్ధి వేగం పుంజుకుంది.
Also Read : జోగి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
బెంగళూరు కూడా అంతే. ఐటి కంపెనీలు లేని హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఊహించుకుంటే ఈ తేడా అర్ధమవుతుంది. కనుక ఏపీకి గూగుల్ వంటి ప్రఖ్యాత ఐటి కంపెనీ వస్తుండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా శుభపరిణామం. విశాఖ నగరం కూడా హైదరాబాద్, బెంగళూర్ నగరాలకు ధీటుగా ఎదగబోతోందనే తొలి సంకేతంగా భావించవచ్చు.