Saturday, September 13, 2025 09:06 AM
Saturday, September 13, 2025 09:06 AM
roots

పోలీసుల ఉచ్చులో సజ్జల

వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెలరేగిపోతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా తీవ్ర స్థాయిలో అభ్యంతరకరంగా మాట్లాడుతున్న వారిని అరెస్ట్ లు చేస్తున్నారు. కార్యకర్తాలనే కాకుండా నాయకులం అని చెప్పుకు తిరుగుతున్న వారిని కూడా అరెస్ట్ చేయడానికి రంగం సిద్దం చేసారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు… అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేసారు.

Also Read :టార్గెట్ వర్రా కాదా…? అసలు ఏం జరుగుతోంది…?

సజ్జల భార్గవ్ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేసారు. దూషణలకు పాల్పడుతున్న వైసీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న భార్గవ్ రెడ్డికి సంబంధించి కీలక సాక్ష్యాలను కూడా సేకరించారు. అధికారపార్టీ నేతలే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా దూషణలకు పాల్పడుతూ ఫోటోలు మార్ఫ్ చేస్తున్న వారిని గుర్తించారు. భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

Also Read : వైసీపీలో ఆ సీనియర్ నేత పరిస్థితి ఏమిటో..?

వైసీపీ సోషల్ మీడియాను నడిపిస్తున్న రాష్ట్రస్థాయి నేత అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేసారు. ఇటీవలే పోలీసుల నుంచి తప్పించుకు పారిపోయిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ వ్యతిరేకులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్న వర్రాను జడ్జి ముందు హాజరు పరిచారు. ఇప్పుడు సజ్జల భార్గవ్ ను అరెస్ట చేయడానికి న్యాయపరమైన అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. వర్రా రవీంద్రా రెడ్డి ఫోన్ లో… కీలక అంశాలను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఇక సజ్జల భార్గవ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపధ్యంలో పోలీసు అధికారులకు వైసీపీ నేతలు ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్