తప్పుడు ప్రచారం చేసే విషయంలో, అసత్యాలను ప్రచారం చేసే విషయంలో వైసీపీ కార్యకర్తలు కొందరికంటే పది అడుగులు ముందే ఉంటారు. టిడిపి నాయకులను, వారి కుటుంబ సభ్యులను అవమానించే విషయంలో ఏమాత్రం ముందు వెనుక ఆలోచించకుండా విమర్శిస్తూ ఉంటారు. అసభ్య ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల విషయంలో ఈ అతి చేష్టలు 2014 నుంచి కనబడుతున్నాయి. టిడిపి పై కోపంగా అంటే కమ్మ కులం పై ఎక్కువగా విద్వేషం చూపించే సదరు కార్యకర్తలు.. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే స్థాయిలో రెచ్చిపోతూ వచ్చారు.
Also Read : చాగంటిపై లోకేష్ ప్రసంశలు.. ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్..!
అయితే ఇప్పుడు వీరిపై ప్రభుత్వం గురి పెట్టింది. ఇప్పటివరకు వారి విషయంలో పెద్దగా దృష్టి పెట్టని పోలీసు వర్గాలు కూడా సీరియస్ గా తీసుకుంటున్నాయి. తప్పుడు ప్రచారం చేసే వారితో పాటుగా అసభ్యకరమైన పోస్టులు చేసే వారిని అరెస్టులు చేస్తున్నారు. తాజాగా సిసింద్రీ రెడ్డి అనే వైసీపీ కార్యకర్తలను తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు గంజాయి వ్యాపారంలో కూడా అతని హస్తం ఉండటంతో అతనిపై ఈ రెండు కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
Also Read : మావోల సంచలన ప్రకటన.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్..!
ఇక తిరుపతికి చెందిన వాణిజ్య పన్నుల అసిస్టెంట్ కమిషనర్ సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ కూడా సస్పెండ్ అయ్యారు. అటు పల్నాడు కు చెందిన మరో ఇద్దరు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు కూడా తెలుస్తోంది. వారి ఖాతాలను ఇప్పటికే హోంశాఖ పలు జిల్లాల పోలీసులకు అందించినట్లు సమాచారం. గుంటూరుకు చెందిన మరో ఇద్దరు కార్యకర్తలను అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నాయి టిడిపి వర్గాలు. ఇప్పటికే వారి తప్పుడు పోస్టుల గురించి పోలీసులకు ఫిర్యాదులు కూడా అందాయి.